నో వార్.. నీడ్ పీస్ టూ డైమెన్షనల్‌కు అవార్డులు

Mon,October 14, 2019 04:01 AM

కురవి, అక్టోబర్ 13: ఈ సంవత్సరం మే నెల మండువేసవిలో 16 రోజులపాటు కష్టపడి మండల కేంద్రానికి చెందిన ఇన్నోవేటివ్ కళాకారుడు నీలం శ్రీనివాసులు సృష్టించిన అద్భుత శాశ్వత సైకత టూడైమెన్షనల్ కళాఖండం నో వార్- నీడ్ పీస్ (యుద్ధం వద్దు.. శాంతి అవసరం)కు ప్రపంచస్థాయి అవార్డు (ఏసియా(ఆసియా)బుక్ ఇంటర్నేషనల్ రికార్డు, జాతీయ స్థాయి ఇండియా బుక్ అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో నీలం శ్రీనివాసులు మాట్లాడుతూ తన కష్టానికి సరైన ఫలితం అవార్డు రూపంలో దక్కిందన్నారు.

రానున్న కాలంలో ఈ కళారూపం గిన్నిస్ బుక్‌లో చోటు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం మే నెల 20వ తేదీన మొదలు పెట్టిన ఈ కళాఖండం జూన్ 4వ తేదీన పూర్తి చేసినట్లు వివరించారు. జూన్ 10వ తేదీన డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ చేతులమీదుగా ఈ కళాఖండాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా సైకత(ఇసుక) కళను కేవలం నదులు, సముద్రాల ఒడ్డున ఎందరో కళాకారులు తమ అపురూప కళను ప్రదర్శించారన్నారు. అదే కళను చిరస్థాయిగా నిలిచేవిధంగా విభిన్న ప్రయోగాలు చేయడం అలవాటుగా మార్చుకున్నానన్నారు. శాశ్వత సైకత శిల్ప రూపకర్తగా, ఫాదర్ ఆఫ్ పర్మినెంట్ స్టాండ్ ఆర్ట్‌గా తొలి ప్రయత్నంలోనే ఈ అవార్డులు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ స్ఫూర్తితో మరిన్ని మంచి కళాఖండాలను రూపొందిస్తానని తెలిపారు. సెప్టెంబర్ 5వ తేదీన ఇండియా బుక్ ఆఫ్ రికార్డు, ఏసియా బుక్ ఆఫ్ రికార్డు సెప్టెంబర్ 13వ తేదీన వచ్చినట్లు తెలిపారు. త్వరలోనే గిన్నిస్ రికార్డు వస్తుందని ఆశాబావం వ్యక్తం చేశారు.

42
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles