సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ సుభిక్షం

Mon,October 14, 2019 04:01 AM

-ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్
చిన్నగూడూరు, అక్టోబర్13 : సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్రం సుభిక్షంగా మారిందని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ అన్నారు. మరిపెడ మండలంలోని ఎల్లంపేట గ్రామ టీఆర్‌ఎస్ గ్రామ కమిటీ బాధ్యులతో పాటు పలు గ్రామాల బాధ్యులు, నాయకులు మండలంలోని ఉగ్గంపల్లిలో ఆదివారం రెడ్యాను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు పుష్పగుచ్ఛాలు అందజేసి శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా రెడ్యానాయక్ పార్టీ బాధ్యులను అభినందించి మాట్లాడారు. కార్యకర్తలంతా పార్టీ పటిష్టతకు సైనికుల్లా పనిచేయాలన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు.

రైతును రాజుగా చూడాలనే లక్ష్యంతో రైతుబంధు, అకాల మరణం పొందిన రైతు కుటుంబాలకు రూ.ఐదు లక్షల రైతుబీమా, బ్యాంకు రుణాలు, ఉచిత విద్యుత్ అందిస్తూ రైతుల పాలిట దైవంగా కేసీఆర్ నిలిచారన్నారు. 30 రోజుల కార్యాచరణ పనులతో గ్రామాల్లో పారిశుధ్య పనులు, హరితహారం, అంతర్గత రోడ్ల మరమ్మతులు చేపట్టి అభివృద్ధి బాటలో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. అభివృద్ధిలో రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా యువ నాయకులు డీఎస్ రవిచంద్ర, సర్పంచ్ తాళ్లపల్లి శ్రీనివాస్ , పార్టీ గ్రామ అధ్యక్షుడు రాగం రమేశ్, ఎంపీటీసీ రఘు, నాయకులు దేవేందర్, సిరి, శోభన్ తదితరులు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles