రూ.778.80 కోట్టు

Sun,October 13, 2019 01:51 AM

- ఇదీ రెండేళ్లలో మద్యం విక్రయ ఆదాయం
- దరఖాస్తులకు చివరి గడువు ఈనెల16
- నేటి వరకు వచ్చిన అప్లికేషన్లు 106
- చివరి మూడు రోజుల్లో భారీగా రానున్న అర్జీలు
- ఏర్పాట్లు చేస్తున్న ఎక్సైజ్‌ అధికారులు
- మహబూబాబాద్‌ పట్టణంలోని షాపులను రెండు క్లస్టర్లుగా విభజన
- ఏజెన్సీ నుంచి నాన్‌ ఏజెన్సీకి మూడు షాపులు బదిలీ

మహబూబాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : రూ.778.80 కోట్లు.. ఇదీ గత రెండేళ్లలో మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయం.. జిల్లా వ్యాప్తంగా 13,68,856 కేసుల లిక్కర్‌, 17,65,202 కేసుల బీర్లు అమ్ముడు పోయినట్లు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. గతంలో 52 షాపులకు గాను 1813 దరఖాస్తులు వచ్చాయి. ఈ సారి శనివారం వరకు 106 దరఖాస్తులు మాత్రమే రాగా, మిగిలిన మూడు రోజులు భారీస్థాయిలో అర్జీలు వచ్చే అవకాశం ఉంది. అందుకనుగుణంగా ఎక్సైజ్‌ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16 వరకు అప్లికేషన్లు స్వీకరించనుండగా, 18న జిల్లా కేంద్రంలోని శనిగపురం రోడ్‌లో ఉన్న ఏబీ ఫంక్షన్‌హాల్‌లో కలెక్టర్‌ సమక్షంలో డ్రా తీయనున్నారు. 52 షాపుల్లో తొమ్మిది ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. బయ్యారం, గార్ల, కొత్తగూడ మండలాల్లో రెండేసి చొప్పున మొత్తం ఆరు షాపుల నిర్వహణకు గ్రామస్తులు తీర్మానాలు చేశారు. అయితే గూడూరు మండలంలో మొత్తం మూడు షాపులు ఉండగా, అక్కడ నుంచి తీర్మానాలు రాలేదు. దీంతో వాటిని అధికారులు ఏజెన్సీ ప్రాంతం నుంచి నాన్‌ ఏజెన్సీకి తరలించారు. ఇక మహబూబాబాద్‌ పట్టణంలో ఉన్న 13 షాపులను రెండు క్లస్టర్లుగా విభజించారు. ఈ విధానం ద్వారా క్లస్టర్‌ పరిధిలో ఎక్కడైనా దుకాణాన్ని నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో వాటికి భారీగా డిమాండ్‌ ఏర్పడింది.

గత రెండేళ్లలో మద్యం అమ్మకాల విలువ రూ.778.80 కోట్లు అయింది. జిల్లా వ్యాప్తంగా 13,68,856 కేసుల లిక్కర్‌, 17,65,202 కేసుల బీర్ల అమ్మకాలు జరిగినట్లు జిల్లా ఎక్సైజ్‌ అధికారులు తెలిపారు. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మద్యం షాపుల నిర్వహణకు దరఖాస్తులు స్వీకరించి డ్రాలు తీస్తుంటారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా జిల్లా వ్యాప్తంగా 52 షాపులకు ప్రస్తుతం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. శనివారం వరకు 106 దరఖాస్తులు వచ్చాయి. ఈనెల 16 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18న జిల్లా కేంద్రంలోని శనిగపురం రోడ్‌లోని జిల్లా కలెక్టర్‌ సమక్షంలో డ్రా తీయనున్నారు. గత సంవత్సరం 52 షాపులకు 1813 దరఖాస్తులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఏడాది అంతకు మించి అర్జీలు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. దరఖాస్తు ఫీజు గత ఏడాది రూ.లక్ష ఉండగా, ఈ ఏడాది రూ.2 లక్షలు చేసిన విషయం తెలిసిందే. 52 షాపుల్లో 9 షాపులు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నాయి. వీటిలో బయ్యారం మండలంలో రెండు, గార్ల మండలంలో రెండు, కొత్తగూడ మండలంలో రెండు షాపులకు తీర్మాణాలు వచ్చాయి.

గూడూరు మండలంలో మొత్తం 3 షాపులు ఉండగా, అక్కడ గ్రామ తీర్మాణాలు రాలేదు. దీంతో ఎక్సైజ్‌ అధికారులు ఏజెన్సీ ప్రాంతం నుంచి నాన్‌ ఏజెన్సీ ప్రాంతాలకు తరలించారు. బయ్యారం మండల కేంద్రంలో అక్కడ గ్రామ తీర్మాణాలు రాకపోవడంతో ఒకటి జగ్గుతండా, రెండోది సంతులాల్‌పాడ్‌ తరలించారు. అక్కడి నుంచి గ్రామ తీర్మాణాలు తెప్పించారు. గత ఏడాది గార్ల మండల కేంద్రంలో రెండు షాపులు ఉండగా, అక్కడ తీర్మానాలు రాకపోవడంతో వీటిని పుల్లూరు, బుద్దారం గ్రామాలకు తరలించారు. అక్కడి నుంచి తీర్మాణాలు వచ్చాయి. కొత్తగూడ మండల కేంద్రంలో కూడా తీర్మాణాలు రాకపోవడంతో వీటిని గుంజేడు, గోవిందాపురం గ్రామాలకు తరలించి అక్కడి నుంచి తీర్మాణాలు తెప్పించారు. గూడూరు మండలంలో మూడు షాపులకు తీర్మాణాలు రాలేదు. దీంతో జిల్లా ఎక్సైజ్‌ అధికారులు భూపతిపేట, అప్పరాజుపల్లి, పొనుగోడు గ్రామ పంచాయతీలకు తరలించారు.

కొనసాగుతున్న అర్జీల స్వీకరణ
జిల్లా వ్యాప్తంగా 52 షాపులకు ఇప్పటి వరకు 106 దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 9 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తుది గడువు 16 వరకు ఉంది. 18న జిల్లా కేంద్రంలోని శనిగపురం రోడ్‌లోని ఏబీ ఫంక్షన్‌ హాల్‌లో జిల్లా కలెక్టర్‌ శివలింగయ్య సమక్షంలో డ్రా తీయనున్నారు. ఈనెల 13న ఆదివారం సెలవు కావడంతో దరఖాసులు స్వీకరించరు. ఇక మిగిలింది మూడు రోజులు మాత్రమే ఉంది. ఈ నెల 14 నుంచి 16 సాయంత్రం 4గంటల లో పు దరఖాస్తులను స్వీకరించనున్నారు. సమయం తక్కువ గా ఉండడంతో మూడు రోజులో దరఖాస్తులు విపరీతంగా పెరుగుతాయని ఎక్సైజ్‌ అధికారులు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యాలయంలో భారీకేడ్లు పోలీస్‌ బందోబస్తు తీసుకుంటున్నారు.

మహబూబాబాద్‌ పట్టణం రెండు క్లస్టర్లుగా విభజన
మహబూబాబాద్‌ పట్టణంలో ఉన్న 13 షాపులను అధికారులు రెండు క్లస్టర్లుగా విభజించారు. దీంతో క్లస్టర్‌-1 కింద 6 షాపులు, క్లస్టర్‌-2 కింద 7 షాపులను కేటాయించారు. ఇందులో పాత పద్దతికి ప్రభుత్వం స్వస్తి పలికింది. కొత్తగా క్లష్టర్లుగా విభజించడంతో క్లస్టర్‌ పరిధిలో వచ్చే షాపులకు చెందిన యజమానులు ఎక్కడైనా షాపులు పెట్టుకోవచ్చు. ఉదాహరణకు గతంలో పాతబజారులో 6 షాపులు, అండర్‌ బ్రిడ్జి ఇవతల నెహ్రూసెంటర్‌, మూడుకోట్లు, గాంధీపార్కు తదితర ప్రాంతాల్లో ఏడు షాపులు ఉండేవి. వీరికి ఎక్కడ కేటాయిస్తే అక్కడే షాపు కొనసాగించే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం పట్టణంలో రెండు క్లస్టర్లుగా విభజించడంతో ఆ క్లస్టర్‌ను యూనిట్‌గా తీసుకుని వైన్స్‌ షాపు వచ్చిన ఎక్కడైనా నిర్వహించుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో పట్టణంలో ఉన్న 13 షాపులకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది.

జిల్లాలో 52 షాపులు
జిల్లాలో మొత్తం 52 షాపులు ఉండగా, ఇందులో 9 షాపులు ఏజెన్సీ పరిధిలో ఉన్నాయి. గతంలో బయ్యారం, గార్ల మండలాలకు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో వచ్చే షెడ్యూల్‌ ఏరియా వారు, అదేవిధంగా కొత్తగూడ, గూడూరు మండలాలకు ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో షెడ్యూల్‌ ఏరియా వారు ఎవరైనా వచ్చి దరఖాస్తు చేసుకునేవారు. ప్రస్తుతం ఆ పద్దతికి చెక్‌ పడింది. మహబూబాబాద్‌ జిల్లా పరిధిలో బయ్యారం, గార్ల, కొత్తగూడ, గూడూరు మండలాల పరిధిలో షెడ్యూల్‌ ఏరియాకు చెందిన వారు మాత్రమే దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

48
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles