చెక్కపై అపురూప చిత్రాలు

Sun,October 13, 2019 01:47 AM

- అందంగా భద్రకాళి అమ్మవారు, విష్ణుమూర్తిలక్ష్మి, రాధాకృష్ణుల ప్రతిమలు
- కర్రలపై కొత్తవాడ కళాకారుడి నైపుణ్యం

పోచమ్మమైదాన్‌, అక్టోబర్‌ 12: శిలలపై శిల్పాలు చెక్కినట్లు చెక్కలపై కూడా కళా రూపాలను మలుచున్నారు. తన హస్త కళా నైపుణ్యాన్ని నలుదిశలా చాటేందుకు అందమైన బొమ్మలు, భక్తిభావం కలిగించే దేవతల చిత్రాలను కర్రపై తీర్చిదిద్దుతూ వరంగల్‌ అర్బన్‌ జిల్లా కొత్త వాడకు చెందిన యువ హస్త కళాకారుడు ఓదెల రవిప్రసాద్‌ రాణిస్తున్నాడు. ఇటీవల జరిగిన భద్రకాళి శరన్నవ రాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ప్రతిరూపాన్ని చెక్కపై చెక్కారు. ముఖ్యంగా దేవతలను చెక్కాలంటే చాలా కష్టమైనప్పటికీ ఇదీ తాను చేసే వృత్తిలో భాగంగా భావిస్తాడు. తాను చెక్కలపై చెక్కుతున్న పని ఎన్నీ రోజులైనప్పటికీ పూర్తి కావడమే లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఆలయంలో కొలువై ఉన్న భద్రకాళి అమ్మవారిని మూడించుల మందం చెక్కపై అచ్చం అమ్మవారి మాదిరిగా తయారు చేశాడు. అలాగే శ్రీ విష్ణుమూర్తి-లక్ష్మి, రాధాకృష్ణులు, అనంత పద్మనాభ స్వామిలను 15 రోజుల పాటు చెక్కలపై చెక్కి తమ ప్రతిభకు సాన పట్టి నిరూపించాడు

గ్రామ దేవతల నుంచి..
గ్రామ దేవతలతో పాటు మరెందరో దేవతల బొమ్మలను చెక్కలపై మలిచి కొత్తవాడ ప్రాంతానికి గుర్తింపు తీసుకొస్తున్నారు. చేనేత కార్మికులతో పాటు హస్త కళాకారులు ఉన్నారని చెప్పుకోవడానికి నిదర్శనంగా నిలుస్తున్నాడు. గతంలో ఒకే కళా ఖండంలో 11 రకాల జంతువుల బొమ్మలను మలిచి, పర్యావరణానికి హాని చేసే వాటిని వివరించి, అప్పటి స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారితో సత్కారం పొందాడు. ముఖ్యంగా బొడ్రా యి పండుగ చేస్తున్నారంటే రవిప్రసాద్‌కు చేతినిండా పనే. దేవతల రూపాలైన భూలక్ష్మి, పోతరాజులను తయారు చేసి ఇస్తుంటారు. అలాగే వాస్తు దోషానికి అవసరమైన తెల్ల జిల్లేడు చెక్కపై అతి చిన్న వినాయకుడిని మలిచి, అందిస్తారు. ఇప్పటి వరకు శ్రీ షిర్డీ సాయిబాబా, శివపార్వతులు, మహంకాళీ, సుబ్రమణ్యస్వామి, మార్వాడీల ఆరాధ్య దైవమైన రాందేవ్‌, అన్నారం షరీ ఫ్‌ ఉత్సవంలో అవసరమైన, గుర్రపు బొమ్మలు, తల్లీకూతురు, వెంకి బొమ్మలను సైతం కళా రూపాలుగా వెలుగొందాయి.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles