మంత్రిని కలిసిన నాయకులు

Sun,October 13, 2019 01:46 AM

మంగపేట, అక్టోబర్‌12: మంగపేట మండల టీఆర్‌ఎస్‌ నాయకులు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి దయాకర్‌రావును హైదరాబాద్‌లో శనివారం కలిశారు. పొ దుమూరు శివారు గోదావరి తీరం ప్రాంత పొలాలు కోతకు గురవుతున్న విషయం, వరదలకు దెబ్బతిన్న పుష్కరఘాట్‌ సమస్య, మంగపేట-బోరునర్సాపురం మధ్య ప్రవహిస్తున్న గౌరారం వాగు చెరుపల్లి పెద్ద చెరువుకు మళ్లింపు తదితర విష యాలపై మంత్రికి విన్నవించారు. రెండు నెలలుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉప్పొంగుతూ తీరం కోతకు గురై విలువైన వ్యవసాయ భూములు నదీ గర్భంలో కలిశాయని, మంగపేట పుష్కరఘాట్‌కు వెళ్లే బీటీ రోడ్డు కోతకు గురై నదిలో కొట్టుకు పోయిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పుష్కరఘాట్‌కు ప్రస్తుతం తోవ లేదని, భూములు కోతకు గురై రైతులు ఆందోళన చెందుతున్నారని మంత్రికి వివరించారు. మంగపే ట-బోరునర్సాపురం మధ్య ప్రవహిస్తున్న గౌరారం వాగు నీరంతా ఏళ్ల తరబడి వృథాగా గోదావరిలో కలుస్తోందని, గౌరారం వాగు నీటిని పెద్ద చెరువుకు మళ్లిస్తే అదనంగా మరో వెయ్యి ఎకరాల పొలాలకు సాగు నీరు అందుతుందని తెలి పారు. మండలంలోని అంతర్గత రోడ్ల పరిస్థితిపై మంత్రి దయాకర్‌రావుకు విన్నవించారు. సమస్యలు విన్న మంత్రి సానుకూలంగా స్పందించినట్లు టీఆర్‌ఎస్‌ నాయకులు తెలిపారు. అనంతరం హన్మకొండలో మాజీ మంత్రి చందూ లాల్‌ను కలిసి సమస్య వివరించారు. మంత్రి ఎర్రబెల్లిని కలిసిన వారిలో మాజీ జెడ్పీటీసీ శిద్దంశెట్టి వైకుంఠం, ఇన్‌చార్జి పోలిన హరిబాబు, పచ్చా శేషగిరిరావు, పగిడిపల్లి వెంకటే శ్వర్లు, చిలుకమర్రి లక్ష్మయ్య, ధూళిపాల సుబ్బారావు, చిలుకమర్రి రాజేందర్‌, అన్వర్‌, రాజమల్ల సుకుమార్‌, జంపా ల కర్ణాకర్‌ తదితరులున్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles