ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలి

Sun,September 15, 2019 03:10 AM

కేసముద్రం రూరల్, సెప్టెంబర్14: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన ప్రగతి ప్రణాళికను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు జేసీ డేవిడ్ సూచించారు. శనివారం మండల కేంద్రంతో పాటు అమీనాపురం, కల్వల గ్రామాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. హరితహాంలో భాగంగా నాటిన ప్రతీ మొక్కను సంరక్షించాల న్నారు. గ్రామాల్లో వందశాతం మరుగుదొడ్లు, ఇంకుడు గుంత లు నిర్మించుకునేలా చూడాలన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి పాటుపడాలని అన్నా రు. కార్యక్రమంలో ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి ఛత్రునాయక్, సర్పంచ్‌లు బట్టు శ్రీనివాస్, గంట సంజీవరెడ్డి, పురం రాజమణి, ఎంపీటీసీలు అశోక్‌రెడ్డి, దామరకొండ ప్రవీణ్‌కుమార్, వెంకన్న, ముత్యాల శివకుమార్, గుగులోత్ వీరూనాయక్, తహసీల్దార్ సురేష్‌కుమార్, ఎంపీడీవో నాగుశ్వర్‌రావు, వ్యవసాయ అధికారి వెంకన్న, లింగల పిచ్చయ్య, వీఆర్‌వోలు పాల్గొన్నారు.

గూడూరు : మండలంలోని పలు గ్రామాల్లో జరుగుతున్న ప్రణాళిక పనులను జేసీ డేవిడ్ పరిశీలించారు. మండలంలోని బొల్లేపల్లి గ్రామ పరిధి బంచరాయితండాలో పారిశుధ్య పనులు పరిశీలించి పంచాయతీ కార్యదర్శిని పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం జడ్పీటీసీ గుగులోత్ సుచిత్ర, ఎంపీపీ సుజాతతో కలిసి గ్రామంలో మొక్కలు నాటారు.

గంగారం : మండల తహసీల్దార్ కార్యాలయ అవరణలో ప్రణాళిక పనుల్లో భాగంగా జేసీ మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మొక్కలు ముందుతరానికి జీవనా ధారం అన్నారు. గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్యాంసుందర్, తహసీల్దార్ ముగ్దం ప్రభాకర్, అటవీశాఖ అధికారి చలపతిరావు, రెవెన్యూ సిబ్బంది, సర్పంచ్ చింత సారక్క పాల్గొన్నారు

52
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles