వసూళ్లకు పాల్పడితే ఇంటికే

Sun,September 15, 2019 03:10 AM

కొత్తగూడ, సెప్టెంబర్ 14: వసూళ్లకు పాల్పడితే ఇంటికి పంపి స్తానని జేసీ డేవిడ్ అన్నారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయాన్ని శనివారం జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో జరుగుతున్న అభి వృద్ధి పనుల పురోగతిపై కార్యదర్శులను అడిగి తెలుసుకున్నారు. రైతు బంధు, ఇతర పనులకు రెవెన్యూ సిబ్బంది వసూళ్లకు పాల్పడితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. రైతులకు అందుబాటులో ఉంటూ సేవలు అందించాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అనేక కార్యక్రమాల్లో ముందుండి పనిచేయాలని సిబ్బందికి సూచించారు. 30 రోజుల ప్రణాళికలో గ్రామాల్లో స్వచ్ఛందంగా పనులు జరిగేలా చూడాలన్నారు. రికార్డులను పరిశీలించి అనంతరం గుంజేడు గ్రామపంచాయతీలో జరుగుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ కమల, సర్పంచ్ బానోత్ విజయ తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles