యూరియా కొరత అసత్య ప్రచారం

Sat,September 14, 2019 02:03 AM

-అన్నదాతలు ఆందోళన చెందొద్దు
-సకాలంలో సరిపడా ఎరువులు అందిస్తాం
-జిల్లా వ్యవసాయ అధికారి ఛత్రునాయక్
-బయ్యారం సొసైటీలో తనిఖీలు

మహబూబాబాద్ నమస్తే తెలంగాణ, సెస్టెంబర్13: జిల్లా లో రైతులకు యూరియా చేరుతోంది. గత కొద్దిరోజులుగా సొసైటీలద్వారా అధికారులు యూరియా పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం రైతులకు కొరత రాకుండా ఉండేందుకు బ్లాక్ మార్కెట్‌ను నిషేధించి సొసైటీల ద్వారానే రైతులకు నేరుగా అందేవిధంగా ఏర్పాట్లు చేసింది. దీంతో సొసైటీల వద్ద రైతులు క్యూ పద్దతిలో యూరియాను తీసుకెళ్తున్నారు. మహబూబాబాద్ సొసైటీ గోదాం వద్ద రైతులు బారులు తీరారు. ప్రభుత్వం ప్రతీ రైతుకు యూరియా చేరాలనే లక్ష్యంతో బస్తా రూ.375లకే అందిస్తోంది. అదే ఓపెన్ మార్కెట్‌లో అయితే ఫెస్టిసైడ్ మందులు కొనుగోలు చేస్తేనే యూరియాను విక్రయిస్తున్నారని రైతులు వాపోతున్నారు. జిల్లాకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని వ్యవసాయాధికారులు రైతులకు ఎప్పడికప్పుడు సమాచారం అందిస్తున్నారు. ఇప్పడికే జిల్లాకు 780 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి అయినట్లు, జిల్లాలోని సొపైటీలకు 700 మెట్రిక్ టన్నులు పంపిణీ చేయగా, గ్రోమోర్ సెంటర్లకు 80 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశారు. రెండు రోజుల్లో మరో780 మెట్రిక్ టన్నుల యూరియా ను దిగుమతి చేయనున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు.

సొసైటీల ద్వారానే రైతులకు యూరియా అందజేత
రైతులు బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలు పెట్టి నష్టపోకుండా తెలంగాణ ప్రభుత్వం సొసైటీల ద్వారా నేరుగా రైతులకు అందే విధంగా చేస్తుంది. గత సంవత్సరం రైతులకు యూరియా కొరత లేకుండా అందించగలిగింది. ఈ సంవత్సరం కూడా రైతులకు ఎలాంటి కొరతలేకుండా అందిస్తామని జిల్లా వ్యవసాయ అధికారులు దీమాతో ఉన్నారు. వివిధ సొసైటీల్లో యూరియా నిల్వలు ఈ విధంగా ఉన్నాయి. గూడూరు మండలంలో 39.960టన్నులు, గూడూరు మండలం అప్పరాజుపల్లి సొసైటీలో 39.960, కొత్తగూడ మండలంలో 39.960, కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి సొసైటీలో 39.960, నెల్లికురదురు మండలంలో 19.980, నెల్లికుదురు మండలంలోని ఎర్రబెల్లి గూడెంలో 19.980, కేసముద్రం మండలంలో 39.960, గార్ల మండలంలో 39.960, బయ్యారం మండలంలో 79.920, మహబూబాబాద్ మండలంలో 39.960, నర్సింహులపేట మండలంలో 59.940, మరిపెడ మండలంలో 59.940, కురవి మండలంలో 39.960,కురవి మండలం గుండ్రాతి మడుగులో 39.960, డోర్నకల్ మండలంలో 39.960,తొర్రూర్ మండలంలో 59.940, మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది.

రెండు రోజుల్లో 780 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి
రైతులకు ఎప్పడికప్పుడు యూరియా అందిస్తూ ఏరోజుకు ఆరోజు దిగుమతులు చేస్తున్నారు. మరో 780 మెట్రిక్ టన్నుల యూరియాను దిగుమతి చేస్తున్నారు యూరియా పంపిణీ నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles