జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడికి సన్మానం

Sat,September 14, 2019 01:56 AM

నెల్లికుదురు, సెప్టెంబర్ 13: ఈ నెల 5న గురుపుజోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును పొందిన మండలంలోని కాచికల్ ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం దర్గాహుస్సెన్‌కు శుక్రవారం ఉపసర్పంచ్ గట్టు శ్రీనుతో పాటు ఉపాధ్యాయ బృందం శుక్రవారం ఘనంగా సన్మానించారు. అనంతరం మండలస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన ఉపాధ్యాయుడు సంతోశ్‌ను సన్మానించారు. వృత్తిలో రాణించి మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యాకలక్ష్మీ, అరుణ, రాకేశ్‌కుమార్, సంతోశ్, ఫణింద్ర పాల్గొన్నారు.

27
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles