విద్యార్థుల సామర్థ్యాలను పెంచాలి

Sat,September 14, 2019 01:56 AM

కురవి : మండలంలోని కందికొండ ప్రభుత్వ పాఠశాలను డీఈవో సోమశేఖర శర్మ శుక్రవారం తనిఖీ చేశా రు. విద్యార్థుల సామర్థ్యాలను పెంచేలా బోధన చేయాలని సూచించారు. తక్కువగా ఉన్న ఉపాధ్యాయులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. డీఈవో వెంట పాఠశాలల తనిఖీ బృందం శ్రీరాం రమేశ్, వెంకటేశ్ ఉన్నారు.
పారిశుద్ధ్య పనులపై జాగ్రత్తలు తీసుకోవాలిమండల ప్రత్యేక అధికారిగా డీఈవో సోమశేఖర శర్మ కందికొండ గ్రామంలో జరుగుతున్న 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ పనులను పరిశీలించారు. పారిశుధ్య పనులపై అలసత్వంవహిస్తే కార్యదర్శిపై వేటు పడుతుందన్నారు. ఇంటికి ఆరు మొక్కలు తప్పనిసరిగా నాటేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పద్మ, జీపీ ప్రత్యేక అధికారి రమేశ్, వార్డు సభ్యులు రాములు, మహేశ్, ఫీల్డు అసిస్టెంట్ నాగేంద్రాచారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మోద్గులగూడెం గ్రామంలో జరుగుతున్న పనులను మండల ప్రత్యేక అధికారి సోమశేఖర శర్మ, ఎంపీడీవో కే ధన్‌సింగ్ పర్యవేక్షించి, పలు సలహాలు సూచనలు అందజేశారు.

20
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles