పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Sat,September 14, 2019 01:56 AM

-డీఈవో సోమశేఖర్ శర్మ
మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 13 : ప్రతీ ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సోమ శేఖర్ శర్మ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో స్వచ్ఛ పక్షోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భం గా డీఈవో మాట్లాడుతూ పాఠశాలలోని ప్రతీ విద్యార్థి ఆరోగ్యంగా ఉంటేనే హాజరుశాతం పెరుగుతుందన్నా రు. ప్లాస్టిక్‌ను వినియోగించవద్దని, సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అక్షరాభ్యాసం నేర్పి జిల్లాలో అక్షరాస్యత రేటును పెంచాలన్నారు.

స్వచ్ఛ పక్షోత్సవాల సందర్భంగా నిర్వహించిన పోటీల్లో జిల్లా స్థాయిలో గెలిచిన విద్యార్థులు హైదరాబాద్‌లో ఈనెల 16న రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరుకావాలన్నారు. సీనియర్ పెయిటింగ్‌లో ప్రథమ స్థానం అశోక్ (జెడ్పీహెచ్‌ఎస్ గార్ల), ద్వితీయ స్థానం వీరన్న (జెడ్పీహెచ్‌ఎస్ మునిగలవీడు), వ్యాస రచన పోటీల్లో భవ్యశ్రీ (డోర్నకల్), ద్వితీయ బహుమతి ఐశ్వర్య (జెడ్పీహెచ్‌ఎస్ గూడూరు), టాలెంట్ టెస్ట్‌లో ప్రథమ బహుమతి సాయిగణేశ్ (నెల్లికుదురు), ద్వితీయ బహుమతి సతీశ్‌కు లభించాయన్నారు. అనంతరం గెలిచిన విద్యార్థులకు డీఈవో ప్రశంసాపత్రాలను అంద జేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంవో మందుల శ్రీరాములు ప్రభుత్వ బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయు డు మురళి, ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, ఐలయ్య, వీరన్న, స్వరూపరాణి, నరేశ్, వీరయ్య, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

16
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles