అభివృద్ధిలో రాష్ట్రం ఆదర్శం

Sat,September 14, 2019 01:55 AM

-టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్‌రావు
చిన్నగూడూరు, సెప్టెంబర్13 : అభివృద్ధిలో తెలంగాణ రాష్ర్టాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు అన్నారు. శుక్రవారం మండలంలోని విసంపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యంతో అభివృద్ధికి నోచుకోని తెలంగాణను కేసీఆర్ సీఎం అయిన తర్వాత నాలుగేళ్లలోనే అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అవకాశాలు పొందిన కొందరు అసంతృప్తిని వ్యక్తం చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. ఏదో ఒక అవకాశం పొందినవారే పదోన్నతి కోసం బజారున పడటం మంచి పద్దతి కాదన్నారు. కేవలం పదవుల కోసం బ్లాక్‌మెయిల్ చేసే నేతలపై కఠిన వైఖరి అవలంభించాల్సి ఉంటుందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తనలాంటి వారు అవకాశాలు రాకున్నా కేసీఆర్ నాయకత్వంలో పార్టీ శ్రేయస్సుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ముప్పై రోజుల కార్యాచరణలో గ్రామస్థాయి అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేసి లక్ష్య సాధనలో విజయం సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మండల, గ్రామ కో ఆర్డినేటర్లు మంగపతిరావు, దేవేందర్‌రావు, స్థానిక నాయకులు మక్క వెంకన్న, బొమ్మ వెంకన్న, కొమ్ము శరత్, రాములు, మధు, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

19
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles