ఉపాధ్యాయుడికి ఉత్తమ సేవా పురస్కారం

Sat,September 14, 2019 01:55 AM

కురవి, సెప్టెంబర్ 13: మండలంలోని గుండ్రాతిమడుగు(విలేజ్) ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సెంసాని రఘువేందర్ చేసిన సేవలకు శుక్రవారం అత్యుత్తమ పురస్కారం అందుకున్నారు. శారద ఎడ్యుకేషనల్ సొసైటీ శ్రీ సాయి శాంతి సహాయక సేవా సమితి వారిచే మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని హైదరబాద్ లోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో జరిగిన కార్యాక్రమంలో శత గురుపూజోత్సవ వేడుకల్లో ఈ పురస్కారం దక్కింది. అవార్డు ప్రదానోత్సవానికి మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బ్రదర్ షపీ, ధరస్వామిజీ పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, జాతీయ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు ఉప్పుల శ్రీనివాస్ గుప్తల చేతుల మీదుగా రఘువేందర్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు ఉపాధ్యాయ బోధనతోపాటు చేసిన సేవలను గుర్తించి ఇచ్చారు. రఘువేందర్ బహుముఖ ప్రజ్ఞాశాలి. జీవశాస్త్ర ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూనే కురవి మండలంలోని జాతీయ అక్షరాస్యత కార్యక్రమాలలో పాల్గొన్నారు. కురవి మండల లిటరసీ ఆర్గనైజర్‌గా నాలుగు సంవత్సరాలు పనిచేశారు. ప్రభుత్వం చేపట్టిన డీపీఈపీ కార్యక్రమాలలో కళాప్రదర్శనలు నిర్వహించారు.

సృజ నాత్మకతను అద్దంపట్టే ఎన్నో నాటకాలు రాసి వాటికి దర్శకత్వం వహించారు. 1995 నుంచి ఉపాధ్యాయ విద్యాబోధనలో ఉపాధ్యాయులకు ఇన్‌సర్వీస్ టీచర్స్ ట్రెనింగ్ ప్రోగ్రాంలో జీవశాస్త్ర జిల్లా రీసోర్స్ పర్సన్‌గా వ్యవహరిస్తు న్నారు. అంగన్‌వాడీ పక్షోత్సవాల కార్యక్రమాల్లో పాల్గొని తల్లిపాల విలువను విస్తృతంగా ప్రచారం చేశారు. ఎయిడ్స్‌బారిన పడకుండా జాగ్రత్తలు, విద్యార్థులకు జ్ఞాపకశక్తి పెంచేందుకు మెళకువలు, యోగా తదితర కార్యక్రమా లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఏ పాఠశాలలో పనిచేసిన తనకంటూ ఓ గుర్తింపును దక్కించుకున్నాడు. 2012 ఉమ్మడి వరంగల్ జిల్లాలో సెప్టెంబర్ 05న ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా రఘువేందర్ నమస్తే తెలంగాణతో మాట్లాడుతూ పురస్కారం తనపై మరింత బాధ్యత పెంచిదన్నారు. రాబోయే మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టడానికి అవార్డు దోహదపడుతుందన్నారు.

25
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles