రోటా వైరస్ నివారణ వ్యాక్సిన్ ప్రారంభం

Thu,September 12, 2019 03:47 AM

మంచిర్యాల అగ్రికల్చర్ : నియమిత టీకా కార్యక్రమంలో కొత్త వ్యాక్సిన్ చేర్చడం ద్వారా రోటా వైరస్ నివారణ సాధ్యమవుతుందని కలెక్టర్ భార తి హోళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జిల్లా పరిషత్ అధ్యక్షురాలు నల్లాల భాగ్యలక్ష్మి, జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భీష్మతో కలిసి జిల్లా వైద్యాధికారులు, మహిళ, శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ అధికారులతో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ రోటా వైరస్ నివారణకు వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలిపారు. డయేరియా వైరస్, బ్యాక్టీరియా వల్ల ఈ వైరస్ వస్తుందని చెప్పారు. ఇది ఏడాదిలోపు పిల్లల్లో నీళ్ల విరేచనాలు కలిగిస్తుందని వెల్లడించారు. శరీరంలో నీరు, లవణాల శాతం తగ్గిపోయి పిల్లలు మరణిం చే ప్రమాదం ఉందన్నారు.

నీళ్ల విరోచనాలతోపాటు జ్వరం, వాంతులు, కడుపునొప్పి లక్షణాలు మూడు నుంచి ఏడు రోజుల్లో కనిపిస్తాయన్నారు. దీనిని గుర్తించి చికిత్స అందించాలన్నారు. ఈ వ్యా క్సిన్ పిల్లలకు ప్రస్తుతం వేస్తున్న ఓపీవీ, ఎఫ్‌ఐపీవీ, ఐసీవీ, పెంటాలెంట్ వ్యాక్సిన్‌తోపాటు ఆర్‌వీవీ(రోటాసిల్) వ్యాక్సిన్ కూడా వేయనున్నారని, బిడ్డ పుట్టిన ఏడాదిలోపు మూడు డోసులు వేస్తారన్నా రు. మిషన్ ఇంద్ర ధనుష్‌లో రోటావైరస్ వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. అనంతరం శిశువులకు జిల్లా పరిషత్ అధ్యక్షురాలితో కలిసి వ్యాక్సిన్‌ను ఇచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతకు ముందు రోటావైరస్‌కు సంబంధించి వాల్‌పోస్టర్లను విడుదల చేశారు. కార్యక్రమంలో మహిళ, శిశు సంక్షేమ శాఖ అధికారి రవూఫ్ ఖాన్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంటు డాక్టర్ యశ్వంత్ రావు, డి ప్యూటీ డీఎం అండ్ హెచ్‌ఓ డాక్టర్ ఫయాజ్ ఖాన్, డాక్టర్ సత్యనారాయణ, డాక్టర్ నీరజ, డాక్టర్ విజయ పూర్ణిమ, వైద్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles