గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దాలి : ఎమ్మెల్యే శంకర్‌నాయక్

Thu,September 12, 2019 02:59 AM

గ్రామ అభివృద్ధి కోసం ప్రవేశ పెట్టిన 30 రోజుల ప్రణాళిక కార్యచరణలో ప్రతీ ఒక్కరు ఒక్క రోజు సమయాన్ని కేటాయించి గ్రామాన్ని సుందరంగా తీర్చి దిద్దుకోవాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. గ్రామంలో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయాలని సర్పంచ్ రావుల విజితరవిచందర్‌రెడ్డి కోరగా, ఎకరం స్థలం అప్పగిస్తే వారం రోజుల్లో సబ్‌స్టేషన్ మంజూరి చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామ స్వరాజ్యం రావాలని గాందీజీ కన్న కలలను సీఎం కేసీఆర్ సాధిస్తున్నాడని తెలిపారు. 30 రోజుల కార్యచరణలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెట్లు పెంచాలని, పాడు బడిన బావులు పూడ్చుకోవాలని, సైడు కాలువలను శుభ్రం చేసుకోవాలని సూచించారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఒక్క సర్పంచ్, ఒక్క ఎమ్మెల్యే , ఒక్క ఎంపీ అనుకుంటే సరిపోదని గ్రామ ప్రజలందరికీ రావాలని సూచించారు.

ఇంటి పన్నులు క్రమం తప్పకుండా చెల్లించినట్లయితేనే గ్రామం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. బడ్జెట్‌లో రైతు బంధుకు 12వేల కోట్లు, రుణమాఫీకి 6వేల కోట్లు, ప్రమాదభీమాకు రూ.1137 కోట్లు కేటాయించాడని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రావుల విజిత రవిచందర్‌రెడ్డి, ఎంపీపీ ఓలం చంద్రమోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు మాదారపు సత్యనారాయణరావు, జిల్లా వ్యవసాయ అధికారి ఛతృనాయక్, తహసీల్దార్ సురేశ్‌కుమార్, ఎంపీడీవో నాగేశ్వర్‌రావు, వైస్ ఎంపీపీ రావుల నవీన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు మర్రి రంగారావు, దామరకొండ ప్రవీణ్‌కుమార్, రావుల రవిచందర్‌రెడ్డి, మర్రి నారాయణ్‌రావు, భట్టు శ్రీను, కముటం శ్రీను, గుగులోత్ వీరునాయక్, దీకొండ వెంకన్న తదితరులు ఉన్నారు.

55
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles