రైతుల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం

Thu,September 12, 2019 02:58 AM

కేసముద్రంటౌన్, సెప్టెంబర్ 11 : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల అభివృద్ధికి పాటుపడుతున్నారని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత కొనియాడారు. 30 రోజుల ప్రణాళిక కార్యచరణ అమలు కార్యక్రమంలో బుధవారం మండలంలోని తాళ్లపూసపల్లి గ్రామంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్‌తో కలిసి ఆమె పాల్గొన్నారు. కురవి దేవస్థానం నుంచి వయా కేసముద్రం మీదుగా అన్నారం షరీఫ్ వెళ్లు ఆర్టీసీ బస్సును వారు ప్రారంభించారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ బస్సు నడుపగా, ఎంపీ కవిత ప్రయాణికులకు టికెట్లు పంపిణీ చేశారు. గ్రామంలోని రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంపీ మాట్లాడారు. రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని భావించిన సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టాడని తెలిపారు. భూగర్భ జలాలను పెంచేందుకు మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, 24 గంటల విద్యుత్ సరఫరా, ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వని విధంగా పంటలకు పెట్టుబడి కోసం ఎకరానికి రూ.10 వేల ఆర్థిక సాయం, మరణించిన రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా వంటి కార్యక్రమాలు చేపట్టాడన్నారు. సాగు నీటికి ఇబ్బందులు లేకుండా కృష్టా, గోదావరి నదులపై శాశ్వత ప్రాజెక్టులు నిర్మిస్తున్నాడని తెలిపారు.

ఆడపిల్లల వివాహానికి రూ.100116 ఆర్థిక సాయం, అమ్మఒడి, కేసీఆర్ కిట్టు, ఆసర పెన్షన్ల పెంపు వంటి పథకాలు ప్రవేశ పెట్టి పేదలకు అండగా ఉంటున్నాడని తెలిపారు. వర్షాలు సంవృద్ధిగా కురువాలన్నా, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా గ్రామాల రూపురేఖలు మార్చాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ పచ్చదనం, పరిశుభ్రతపై దృష్టి సారించారని తెలిపారు. దీనిలో భాగంగానే 30 రోజుల కార్యచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో ప్రతీ వ్యక్తి భాగస్వామ్యులు కావాలని సూచించారు. ఉపాధి హామీ ద్వారా ప్రభుత్వం మరుగుదొడ్లు నిర్మిస్తుందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటి చుట్టు పక్కల ప్రాంతాలల్లో మురికి నీరు లేకుండా చూసుకోవాలని, మురికి నీరు ఉండటం మూలంగా దోమలు విజృంభించి విష జ్వరాల భారీన పడాల్సి వస్తుందన్నారు.

ఆరుబయట మల మూత్ర విసర్జన చేసినట్లయితే రూ.5వందల జరిమానా విధించాలన్నారు. పారిశుధ్యంతో పాటు పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, చెట్లు ఉంటేనే మానవ మనుగడ సాధ్యమవుతుందన్నారు. చెట్లు పెంచడం వల్ల వర్షాలు సంమృద్ధిగా కురిసి పంటలు పండడంతో పాటు, భూమి మీద నివసించే ప్రాణులకు స్వచ్ఛ మైన ఆక్సిజన్ అందుతుందన్నారు. ప్రతీ ఇంటికి ప్రభుత్వమే ఉచితంగా 6 మొక్కలు అందిస్తుందని, వాటిని తప్పకుండా నాటి పోషించాలని, అంతేకాకుండా ఖాళీ స్థలంలోను, పొలం గట్లపై టేకు చెట్లు పెంచాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలలో, రోడ్లుకు ఇరువైపుల , గుట్టల ఉన్న ప్రదేశాలలో పండ్ల మొక్కలు పెంచడం వల్ల కోతుల సమస్య పరిష్కారం అవుతుందన్నారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles