గణనాధుని నిమజ్జనానికి సకల ఏర్పాట్లు

Wed,September 11, 2019 02:06 AM

తొర్రూరు, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్‌ 10:గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగిసిన తరుణంలో గణనాధుని నిమజ్జనానికి డివిజన్‌ కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో చెరువుల వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. తొర్రూరు పెద్ద చెరువులో గణనాధుల నిమజ్జనం కోసం భారీ గేట్లు ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో ఎలాంటి ఇబ్బుందులు లేకుండా పెద్ద ఎత్తున లైటింగ్‌ ఏర్పాటు చేసి భారీ విగ్రహాల నిమజ్జనం కోసం క్రేన్లను అందుబాటులో ఉంచారు. మండలంలోని అన్ని గ్రామాల్లో 710 విగ్రహాలను ప్రతిష్టాపించి తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహించారు. తొర్రూరు పట్టణ కేంద్రంలో 15 భారీ విగ్రహాలను ఏర్పాటు చేశారు. పెద్ద చెరువులో నిమజ్జనం కోసం వెళ్లే వాహనాలు ఎల్‌వైఆర్‌ గార్డెన్‌ మీదుగా చెరువు వద్దకు చేరుకుని నిమజ్జనం అనంతరం హరిపిరాల రోడ్డు మీదుగా ప్రధాన రోడ్డుకు చేరుకునేలా అధికారులు రహదారులను శుభ్రపరిచి సిద్దంగా ఉంచారు. గణేశ్‌ శోభయాత్రలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా పట్టణ కేంద్రంలోని ప్రధాన రహదారి నుంచి పెద్ద చెరువు వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి పోలీస్‌స్టేషన్‌లో డీఎస్పీ, ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఎఎస్సైలు, 10 మంది కానిస్టేబుళ్లతో పర్యవేక్షణ చేస్తుంటారు. చెరువు వద్ద ఎలాంటి ఇబ్బందులు లేకుండా మున్సిపల్‌ కమిషనర్‌ గుండె బాబు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి పర్యవేక్షించారు. చెరువులో నీరులో ఉండడంతో ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా చెరువుపై పూర్తి అవగాహన కలిగిన ముదిరాజ్‌లు, గజ ఈతగాళ్లు, ఆగ్నిమాపక యంత్రాలను అందుబాటులో ఉంచారు. తొర్రూరు పెద్ద చెరువుకు అధిక సంఖ్యలో విగ్రహాలు ఇచ్చ అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు జరుగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు.

37
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles