అన్నదానం మహాదానం

Wed,September 11, 2019 02:05 AM

-ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ ఉషాదయాకర్‌రావు
తొర్రూరు, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్‌ 10
పేదలకు అన్నదానం చేయడం ఎంతో గొప్ప విషయమని ఎర్రబెల్లి చారిటబుల్‌ ట్రస్ట్‌ చైర్‌పర్సన్‌ ఉషాదయాకర్‌రావు అన్నారు. డివిజన్‌ కేంద్రంలోని (దుబ్బతండా) బంజారనగర్‌లో నాయక్‌యూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మంగళవారం ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పది మంది పేదలకు అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. డివిజన్‌ కేంద్రంలోని పలు వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తుర్పాటి చిన్న అంజయ్య, జడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్‌, మండల పార్టీ అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, పట్టణ అధ్యక్షుడు, గ్రంథాలయ సంస్థ జిల్లా డైరెక్టర్‌ రామిని శ్రీనివాస్‌, మాజీ ఎంపీపీ కర్నె సోమయ్య, పాలకుర్తి దేవస్థాన డైరెక్టర్‌ కృపాకర్‌రాజు, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు బిజ్జాల శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ ఇట్టే శ్యాంసుందర్‌రెడ్డి, నాయకులు మాడ్గుల నట్వర్‌, ధరావత్‌ సోమన్న, అంకూస్‌, జైసింగ్‌, వెంకన్న, బిజ్జాల అనిల్‌, కుర్ర శ్రీనివాస్‌, ధరావత్‌ బాలు, ప్రవీణ్‌కుమార్‌, తండా వాసులు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles