కలికట్టుగా పనిచేయండి...

Wed,September 11, 2019 02:05 AM

-జడ్పీ సీఈవో సన్యాసయ్య, డిపీవో రంగాచారి
కురవి, సెప్టెంబర్‌ 10: గ్రామాల అభివృద్ధి మీ చేతుల్లోనే ఉందని, ప్రభుత్వం తీసుకువచ్చిన 30రోజుల ప్రణాళిక కార్యాచరణతో గ్రామాలు ప్రగతి బాటపడుతాయని జడ్పీసీఈవో సన్యాసయ్య, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారిలు అన్నారు. కురవి మండలంలోని మోద్గులగూడెం, జుజ్జూరుతండా పంచాయతీలలో 30రోజుల ప్రణాళీక కార్యాచరణ పనులను అకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....కోర్టు ఆదేశాల మేరకు ఈ రెండు పంచాయతీలలో సర్పంచ్‌ ఎన్నికలు జరగలేదన్నారు. అధికారులు కలిసికట్టుగా ప్రజలతో మమేకమై పనిచేసి మండలంలో రెండు పంచాయతీలను ఉత్తమ గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్ధాలన్నారు. ప్రణాళిక బద్ధంగా పనులు చేసుకుంటూ పోతే పూర్తి అవుతాయన్నారు. ముఖ్యంగా ప్రజలంతా ఇండ్ల పరిసరాలను శుభ్రం చేసుకోవాలన్నారు. హరితహారంలో 06 మొక్కలను విధిగా నాటుకుని, పెంచాలని సూచించారు. శ్రమదానంతో అయ్యే పనులను గుర్తించి, ప్రజలను చైతన్య పరచాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కె.ధన్‌సింగ్‌, పంచాయతీ సెక్రటరీలు రమేష్‌, భవానీ, గ్రామస్థులు పాల్గొన్నారు. కురవి మండలంలోని గ్రామగ్రామాన 30 రోజుల ప్రణాళిక పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ముందుకు పోతున్నారు. ఇప్పటికే గ్రామాలలో డోజర్‌ల సహాయంతో మట్టిని చదును చేయడం, పిచ్చిమొక్కలను తొలగించడం వంటి పనులను పూర్తిచేశారు. స్థాయి కమిటీల సభ్యులు గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

గ్రామాలలో ముప్పె రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలిః జడ్పీ సీఈవో సన్యాసయ్య
30 రోజుల ప్రణాళిక అమలు చేయడంపై అవగాహన సదస్సు
కేసముద్రం రూరల్‌, సెప్టెంబర్‌10ః మండలంలోని ఆయా గ్రామాల అభివృద్ధిలో భాగంగా ఇచ్చిన గడువులోగా గ్రామాలలో ముప్పె రోజుల ప్రణాళికను పక్కాగా అమలు చేయాలని జడ్పీ సీఈవో సన్యాసయ్య అన్నారు. మంగళవారం మండల ప్రజాపరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో నాగేశ్వర్‌రావు అధ్యక్షతన జరిగిన 30 రోజుల ప్రణాళిక అమలు చేయడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్బంగా సీఈవో మాట్లాడుతూ వార్షిక బడ్జెట్‌, పంచవర్ష ప్రణాళికను ఆయా గ్రామాలకు కెటాయించే నిధులకు వీలుగా పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు రిపోర్టును తయారు చేసి సీఈవో కార్యాలయంలో అందచేయాలని ఆదేశించారు. అదే విధంగా దసరా పండుగనాటికి గ్రామాలలో పచ్చదనం, పరిశుభ్రత తప్పని సరిగా అమలు చేయాలని అధికారులకు ఆదేశిచడం జరిగింది. ప్రతీ రోజులు గ్రామాల వారిగా జరుగుతున్న కార్యక్రమాల వివరాలు ఎప్పటి కప్పుడు అందచేయాలని తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రంగాచార్యులు, మండల ప్రత్యేక అధికారి ఛత్రూనాయక్‌, తహాసీల్దార్‌ సురేష్‌కుమార్‌, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారలు పాల్గొన్నారు.

34
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles