ఊరురా శ్రమదానం

Wed,September 11, 2019 02:04 AM

మహబూబాబాద్‌ జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ:గ్రామీణాభివృద్ధికి 30రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జోరుగా సాగుతుంది. జిల్లాలోని 461 గ్రామ పంచాయతీల్లో అధికారులు, కోఆప్షన్‌ సబ్యులు, స్థాయి సంఘాల సబ్యులు ఇప్పటికే గ్రామాల్లో పర్యటించి సమస్యలను గుర్తించారు. వీటిని ప్రాదాన్యతగా పరిష్కారం చేస్తున్నారు. ఈ నెల 6న జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని ప్రజలకు వివరిస్తూ సీఎం కేసీఆర్‌ సందేశాన్ని గ్రామ ప్రజలకు చదివి వినిపించారు. గ్రామ సభలో గ్రామానికి సంబందించిన లక్ష్యాలను- ఉద్దేశాలను ప్రత్యేక అధికారులు ప్రజలకు వివరించారు. ప్రతి గ్రామంలో కో ఆప్షన్‌ సభ్యులు, నాలుగు స్థాయి సంఘాలను ఎన్నుకున్నారు. ప్రతి కమిటితో 30 రోజుల ప్రణాళిక ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామాభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు నడుం బిగించారు. అంశాల వారిగా పనులను ఇప్పటికే ప్రారంబించారు. మొననటి వరకు ఉన్న చెత్త కుప్పలను ఎత్తేస్తున్నారు. పిచ్చి మొక్కలను తొలగిస్తున్నారు. దోమలు రాకుండా పంచాయతీ సిబ్బంది మందులు చల్లుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 30 రోజుల ప్రణాళికలో బాగంగా పంచాయతీల్లో పనులన్ని ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో పనులు జరిగాయి. అధికారులతో పాటు గ్రామాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు పనులను పర్యవేక్షిస్తున్నారు. కూలిపోవడానికి సిద్థంగా ఉన్న ఇళ్లను కూల్చి వేస్తున్నారు. గ్రామాల్లో పాత, బోరుబావులను మట్టి, మొరం కుప్పలతో పూడ్చి వేస్తున్నారు. ఇంకా అనేక గ్రామాల్లో గడితో పాటు ఇతర పచ్చి మొక్కల తొలగింపు జరిగాయి. గ్రామాలకు కేటాయించిన ప్రత్యేక అధికారులు పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles