పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా బద్రినారాయణ

Tue,September 10, 2019 02:28 AM

మహబుబాబాద్, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్09: పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడిగా సంకా బద్రినారాయణ, ప్రధాన కార్యదర్శిగా మిరియాల సతీశ్‌రెడ్డిని 8వ తేదీ ఆదివారం నిర్వహించిన మహబూబాబాద్ జిల్లా పీఆర్టీయూ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పీఆర్టీయూ రాష్ఠ అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడిగా ఎన్నికైన సంకా బద్రినారాయణ కురవి మండలం రాజోలు గ్రామంలో జన్మించారు. 1986లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టినప్పటి నుంచి పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు సామల యాదగిరి శిశ్యుడిగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి మహబూబాబాద్ మండల అధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర బాధ్యులుగా, ఉపాధ్యాయులకు సేవలు అందిస్తూ 2005లో ఉమ్మడి జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైనారు. ఈ క్రమంలో సోమవారం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా సంకా బద్రినారాయణ మాట్లాడుతూ తనను జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవం చేసినందుకు సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీపాల్ రెడ్డి ,ఎమ్మల్సిలు కాటపల్లి జనార్ధన్‌రెడ్డి,కూర రఘోత్తంరెడ్డి,మాజీ ఎమ్మల్సి పూల రవిందర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్‌రావులకు కృతజ్ఙతలు తెలిపారు.వీరితో పాటు 30 మందితో జిల్లా కార్యవర్గం ఎన్నుకున్నారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles