పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Tue,September 10, 2019 02:28 AM

-ఎంపీటీసీ తేజావత్ భోజ్యానాయక్
కురవి, సెప్టెంబర్09: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అనేక వ్యాధులను అరికట్టవచ్చని సీరోలు ఎంపీటీసీ తేజావత్ భోజ్యానాయక్ అన్నారు. కురవి మండలంలోని సీరోలు శివారు రూప్లాతండాలో కురవి పీహెచ్‌సీ ఆధ్వర్యంలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి పరీక్షలు నిర్వహించారు. అనంతరం 58 మందికి ఓపీ పరీక్షలు నిర్వహించారు. అందులో నలుగురు అనుమానితుల నుంచి రక్తనమూనాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎం సునీత, ఆశవర్కర్లు అనూష, విజయ తదితరులు పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles