ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

Tue,September 10, 2019 02:27 AM

కేసముద్రంటౌన్, సెప్టెంబర్09: మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల్లో, ధన్నసరి సింగిల్ విండో నందు సోమవారం విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఎరువుల స్టాక్ నిల్వ, రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అధికారి శ్రీనివాస్ మాట్లాడారు. ఎరువుల లైసెన్స్ చూపించనందున మురళికృష్ణ ఎరువుల దుకాణంలో 351బస్తాలను సీజ్ చేసి నోటీస్ ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా పీఏసీఎస్ బ్యాంక్‌లో ఈ పాస్ మిషన్ నిల్వలకు, అమ్మకపు నిల్వలకు 199బస్తాలు వ్యత్యాసం గుర్తించినట్లు చెప్పారు. స్టాక్‌బోర్డులు, ఎరువుల బస్తాల ధరల సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఏవో వెంకన్న ఉన్నారు.

26
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles