రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Tue,September 10, 2019 02:27 AM

మహబూబాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన ఘటన మహబూబాబాద్ పట్టణ శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా అనంతారం గ్రామానికి చెందిన గాడుదల మల్లయ్య, వెంకటలక్ష్మికి ఇద్దరు కుమారులు. సోమవారం మధ్యాహ్నం పెద్దకుమాడు గాడుదల మహేందర్ తన సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంపై మహబూబాబాద్ పట్టణానికి వచ్చి అనంతారానికి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో బయ్యారం నుంచి మహబూబాబాద్ వేగంగా వస్తున్న ఆటో పట్టణ శివారులో ఆర్తీ గార్డెన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో మహేందర్ అక్కడికక్కడే మృతిచెందాడు. వెనకాల కూర్చున్న తన స్నేహితుడు భాస్కర్‌కు తీవ్రగాయాలవగా స్థానిక ఏరియా దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

డెంగీతో చిన్నారి..
తొర్రూరు రూరల్: డెంగీ జ్వరంతో చిన్నారి మృతి చెందిన ఘటన మండలంలోని గోపాలగిరి గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన ధర్మారపు రాంబాబు-మౌనిక చిన్న కూతురు నందిని(6) వారం రోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతున్నదని బాధితులు చెప్పారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందగా చిన్నారి మృతదేహానికి జెడ్పీటీసీ మంగళపల్లి శ్రీనివాస్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ అనుమాండ్ల దేవేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పసుమర్తి సీతారాములు, రాయిశెట్టి వెంకన్న పూలమాల వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మండలంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వైద్య సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles