చోరీలకు పాల్పడుతున్న ముగ్గురి అరెస్టు

Mon,September 9, 2019 12:48 AM

-బంగారం,వెండి వస్తువులతో పాటు సెల్‌ఫోన్లు స్వాధీనం
కేసముద్రం రూరల్‌, సెప్టెంబర్‌08: చోరీకి పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి బంగారం,వెండి వస్తువులతో పాటుగా సెల్‌ఫోన్లు స్వాదీనం చేసుకున్న సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. మానుకోట రూరల్‌ సీఐ వెంకటరత్నం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అమీనాపురం గ్రామానికి చెందిన కావటి రాజ్‌కుమార్‌ తన తండ్రి ఆరోగ్యం బాగలేక పోవడంతో ఈనెల 5వ తేదీన చికిత్స నిమిత్తం వరంగల్‌కు తీసుకొని వెళ్లి తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఇంటితాళం పగులకొట్టి ఇంట్లోని బీరువాలో ఉన్న పావుతులం బంగారు పుస్తెల బిల్ల, రెండు తులాల వెండి బ్రాస్లెట్‌, మూడు సెల్‌ఫోన్లు ఎత్తుకుని పోయారు. ఈ విషయమై రాజ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం ఇన్‌చార్జి ఎస్సై శంకర్‌రావు, సిబ్బందితో వాహనాల తనిఖీలు చేస్తుండగా గార్ల మండలం ముల్కనూరు గ్రామానికి చెందిన డబ్బా శంకర్‌, ఇల్లందుకు చెందిన బర్సిపోగు సత్యనారాయణ, కేసముద్రం స్టేషన్‌కు చెందిన జగ్గుల శివయ్య అనే ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకున్నారు. వారి నుంచి పావు తులం బంగారు పుస్తెల బిల్ల, రెండు తులాల వెండి బ్రాస్లెట్‌, మూడు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

40
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles