సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Mon,September 9, 2019 12:47 AM

వెంకటాపురం(నూగూరు) సెప్టెంబర్‌ 08 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రతీ కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఖమ్మం ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని వెంకటాపురం, వీరభద్రవరం గ్రామాల్లో పర్యటించారు. ఎమ్మెల్సీ తొలుత వెంకటాపురంలోని వినాయక మండపం వద్ద స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కుక్కతొర్రెవాగు వరద ఉధృతిని పరిశీలించి ఆర్డీవో రమాదేవితో ఫోన్‌లో మాట్లాడారు. గోదావరి వరదల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. పశువుల కాపర్లు లంకల్లో చిక్కుకున్నారని ఎమ్మెల్సీ దృష్టికి రావడంతో పోలీస్‌, రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేశారు. అనంతరం మండల కేంద్రంలో వెంకటాపురం, వాజేడు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా ప్రతినిధులు సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, వెంకటాపురం సీఐ కాగితోజు శివప్రసాద్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూగూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోదెబోయిన బుచ్చయ్య, జెడ్పీటీసీ పాయం రమణ, టీఆర్‌ఎస్‌ నాయకులు వేల్పూరి లక్ష్మీనారాయణ, బాలసాని ముత్తయ్య, గంపా రాంబాబు, బాలసాని శ్రీను, మురళి, కృష్ణారెడ్డి, శ్రీనువాసరావు, దామోదర్‌, శ్రీను, శివాజీ యాదవ్‌, ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles