కాళేశ్వరంలో భక్తుల రద్దీ

Mon,September 9, 2019 12:46 AM

కాళేశ్వరం, సెప్టెంబర్‌ 08 : పవిత్ర పుణ్యక్షేత్రం కాళేశ్వరంలోని స్వామివారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి అశేష సంఖ్యలో భక్తులు దర్శనం కోసం తరలివచ్చారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నిండుకుండలా ఉన్న త్రివేణి సంగమాన్ని చూసి పులకించిపోతున్నారు. కాగా, ఒక్కరోజే సుమారు 5వేల మంది వరకు భక్తులు తరలివచ్చారు. భక్తులు ముందుగా గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి గోదావరి మాతకు దీపాలు వదిలారు. తర్వాత భక్తులు ఆలయంలో స్వామివారికి అభిషేకం, దర్శనం చేసుకొని మొక్కులు సమర్పించుకున్నారు. కాగా, దర్శనం అనంతరం భక్తులు కాళేశ్వరం ప్రాజెక్టు బాట పట్టారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దైవదర్శనం అనంతరం దగ్గరలోని లక్ష్మీ పంప్‌హౌస్‌ను చూసేందుకు వెళ్లారు.

28
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles