బొగత లో పర్యటకుల సండేసందడి

Mon,September 9, 2019 12:46 AM

-సెల్ఫీలు దిగుతు పార్క్‌లో ఆడుతు సందడి
-ఉదృత ప్రవాహంలో నీటిలోకి అనుమతి నిలిపివేసిన అధికారులు
వాజేడు, సెప్టెంబర్‌ 08 : మండలంలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో గల తెలంగాణ నయాగార బొగత జలపాతం తన అందాలతో పర్యాటకులను కట్టిపడేస్తోంది. ఆదివారం జలపాతం అందాలను వీక్షించేందుకు హైదరాబాద్‌, నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, వరంగల్‌, ఆదిలాబాద్‌, ఖమ్మం, సూర్యపేట, కొత్తగూడెం, భద్రాచలం, కరీంనగర్‌, ములుగు, నిజామాబాద్‌, పరకాల తదితర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన పర్యాటకులతో బొగత పరిసరాలు కిక్కిరిసాయి. జలపాతం, చిల్డ్రెన్స్‌పార్క్‌, వాచ్‌టవర్‌ వద్ద పర్యాటకులు సెల్ఫీలు, ఫొటోలు దిగుతూ సందడి చేశారు. జలపాతం వద్ద ఉన్న చిల్డ్రెన్స్‌పార్క్‌లో కుటుంబాల సమేతంగా ఆటలు ఆడుతూ సండే సందడి చేశారు. గోదావరి పోటుతో బొగత జలపాతం వద్దకు వరదనీరు చేరి స్విమ్మింగ్‌పూల్‌ వద్ద ఏర్పాటు చేసిన రక్షణ కంచె నీటమునిగింది. అదేవిధంగా బొగత పార్కింగ్‌ ప్రదేశంలో ఉన్న పగోడల ప్రదేశం వరకు వరదనీరు చేరడంతో అధికారులు జలపాతం నీటిలోకి దిగడడానికి అనుమతి నిలిపివేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు నీటిలోకి అనుమతించకపోతే ఎలా..? అని అటవీశాఖ సిబ్బంది, బొగత రక్షణ కమిటీ సభ్యుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. జలపాతం వద్ద పర్యాటకులను నీళ్లలోకి అనుమతించకుండా రిబ్బన్లతో రక్షణ చర్యలను చేపట్టారు. రక్షణ కోసం పెద్ద ఎత్తున జాలర్లు, రక్షణ టీం సభ్యులను ఏర్పాటు చేశారు.

31
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles