మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం

Sun,September 8, 2019 02:18 AM

-కులవృతుల వారికి సబ్సిడీపై రుణాలు
-ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్
-డోర్నకల్ బతుకమ్మ చెరువులో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే


గార్ల రూరల్(డోర్నకల్), సెప్టెంబర్ 07 : మత్స్యకారుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యా నాయక్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బతుకమ్మ చెరువులో లక్ష పదివేల చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో మొత్తం 715 చెరువులు, కుంటలు ఉన్నాయని వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. అలాగే చేపలు అమ్ముకోవడానికి మండలంలో 82 మంది మత్స్యసభ్యులకు టూ వీలర్స్ 75 శాతం సబ్సిడీ ద్వారా అందించామని గుర్తుచేశారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో మత్స్యకారులు అభివృద్ధి చెందాలని అన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమం తెలంగాణ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. కుల వృత్తులపై ఆధాపడి జీవనం సాగించే వారికి ప్రభుత్వం సబ్సిడీ రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు.

కుల వృత్తుల అదరణ కోసం ప్రభుత్వం అన్ని విధాలా పాటుపడుతుందని అన్నారు. కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గొడుగు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు సహదేవ్, ఎంపీపీ ధరంసోత్ బాలు నాయక్, జెడ్పీటీసీ కమలరామనాథం, జిల్లా మత్స్యశాఖ అధికారి డీ ఆంజనేయ స్వామి, టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నూన్న రమణ, కేశబోయిన కోటిలింగం, పట్టణ అధ్యక్షుడు వాంకుడోత్ వీరన్న, మాజీ ఎంపీటీసీలు విద్యాసాగర్ రావు, రాంబాబు, మాజీ సర్పంచ్ మాదా లావణ్య శ్రీనివాస్, రామనాథం, చెరెడ్డి బీక్ష రెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు, మత్స్య శాఖ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి..
డోర్నకల్ మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. శనివారం మండలకేంద్రంలో అశోక్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు.. డోర్నకల్ మున్సిపల్ పరిధిలోని 15 వార్డుల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఎన్నికలు ఏవైనా.. టీఆర్‌ఎస్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు టీఆర్‌ఎస్ గెలుచుకుందని గుర్తు చేశారు. మిగితా మున్సిపల్ కంటే తక్కువ జనాభా ఉన్న మున్సిపాలిటీలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. ప్రజలపై నమ్మకం ఉంచి పార్టీ గెలుపునకు కృషి చేయాలని అన్నారు. నమ్మకంగా పని చేసే కార్యకర్తకు పార్టీలో గుర్తింపు లభిస్తుందని అన్నారు. నియోజక వర్గంలో 76 ఎంపీటీసీ స్థానాలల్లో 62 ఎంపీటీసీ స్థానాలు టీఆర్‌ఎస్ కైవసం చేసుకున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు డిపాజిట్ గల్లంతు కావాలని కోరారు. గ్రామ కమిటీలకు గాను, మున్సిపల్ కమిటీలకు గాను కార్యకర్తలు కట్టుబడి ఉండాలని అన్నారు. ఆదివారం మండల కమిటీ సమావేశమై కమిటీ పేర్లను వెల్లడిస్తారని తెలిపారు.

అనంతరం మున్సిపల్ పరిధిలో జరుగుతున్న రోడ్ల నిర్మాణం, డ్రైనేజీల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోడిశెట్టి కమలరామనాథం, ఎంపీపీ ధరంసోత్ బాలు నాయక్, మండల పరిశీలకుడు బజ్జూరి పిచ్చిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ కేశబోయిన స్వరూప కోటిలింగం, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు నూన్న రమణ, చెరెడ్డి భిక్ష రెడ్డి, మాజీ ఎంపీటీసీలు విద్యాసాగర్‌రావు, కొత్త రాంబాబు, పట్టణ అధ్యక్షుడు వాంకుడోత్ వీరన్న, రామనాథం మాజీ సర్పంచ్ మాదా లావణ్య, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, గొల్లచర్ల ఎంపీటీసీ భూక్య శ్రీనివాస్, కస్నాతండా ఎంపీటీసీ బానోత్ శంకర్‌కోటి, వెన్నారం సర్పంచ్ బోయనపల్లి వెంకన్న, కొత్తదుబ్బతండా సర్పంచ్ లెనిన్ కుమార్, టీఆర్‌ఎస్ ప్రచార కమిటీ సభ్యుడు రామకృష్ణ, అనిల్, తాళ్లూరి సతీశ్, గ్రామ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు వార్డు సభ్యులు టీఆర్‌ఎస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి
మున్సిపల్ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీర్చాలని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యా నాయక్ అన్నారు.
మున్సిపాలిటీ పరిధిలో ఉన్న విద్యుత్ సమస్యలు, పారిశుధ్య పనులు, డ్రైనేజీ కాల్వల నిర్మాణం కమిషనర్ అందుబాటులో ఉండి పర్యవేక్షించాలని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఇప్పడికే విషజ్వరాలతో సతమతమౌతున్న తరుణంలో గ్రామంలో వీధి లైట్లు వేయకపోవడం, డ్రైనేజీ కాల్వలల్లో బ్లీచింగ్ వేయించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ప్రత్యేక అధికారి భారతి, మున్సిపల్ కమిషనర్ లక్కర్సు రాజు, ఎంపీపీ డీఎస్ బాలు నాయక్, జెడ్పీటీసీ పోడిశెట్టి కమలరామనాథం, కేశబోయిన కోటిలింగం, నూన్న రమణ, చెరెడ్డి భిక్ష రెడ్డి, రామనాథం టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు వాంకుడోత్ వీరన్న, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీలు విద్యాసాగర్, కొత్త రాంబాబు టీఆర్‌ఎస్ నాయకులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles