30 రోజుల ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం

Sun,September 8, 2019 02:15 AM

కేసముద్రంరూరల్, సెప్టెంబర్ 07 : గ్రామాభివృద్ధే లక్ష్యంగా 30 రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని ఆయా గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక అధికారులు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శనివారం మండలంలోని తౌర్యాతండా జీపీ పరిధిలోని తండాలలో ప్రత్యేక అధికారి ఛత్రూనాయక్ ఆధ్వర్యంలో తండాలకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలు, సైడు కాలువలల్లో పేరుకపోయిన చెత్త, చెదారాన్ని తొలగించే కార్యక్రామాన్ని ప్రారంభించారు. అదేవిధంగా కల్వల, ఇనుగుర్తి, లాలుతండా గ్రామాల్లో జరిగిన కార్యక్రమాలల్లో తహసీల్దార్ సురేశ్ కుమార్, ఎంపీడీవో నాగేశ్వర్‌రావు పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్‌లు భూక్య శ్రీనివాస్‌నాయక్, గంట సంజీవరెడ్డి, దార్ల రామ్మూర్తి, రామన్న, ఉపసర్పంచ్‌లు గుండ్రపల్లి దేవేందర్, నరేందర్, బీట్ ఆఫీసర్ శ్రీధర్, సెక్షన్ అధికారి కృష్ణవేణి, చైతన్య, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శి, ఏఏవోలు పాల్గొన్నారు.

32
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles