పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Sun,September 8, 2019 02:15 AM

-జెడ్పీ సీఈవో సన్యాసయ్య
మహబూబాబాద్ రూరల్ సెప్టెంబర్ 07 : పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జెడ్పీ సీఈవో సన్యాసయ్య అన్నారు. శనివారం మహబూబాబాద్ మండలంలోని జంగిలికొండలో జరుగుతున్న పారిశుధ్య పనులను శనివారం సన్యాసయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు 30రోజుల ప్రణాళికను ప్రవేశపెట్టినట్లు గుర్తుచేశారు. 30రోజుల కార్యక్రమంలో గ్రామ సమస్యలన్నీ పరిష్కారం కావాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీలో కో-ఆప్టేడ్ సభ్యులను ఎన్నుకున్నారు. రిటైర్ ఉద్యోగి కాశీమల్ల భిక్షం, మహిళా సంఘం నుంచి గంగాధరి ఎల్లమ్మ, దాతల నుంచి పురుషోత్తమ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles