తెలుగు విభాగం పాఠ్యప్రణాళిక అధ్యక్షుడిగా కిషన్‌ప్రసాద్

Sun,September 8, 2019 02:15 AM

రెడ్డికాలనీ, సెప్టెంబర్ 07 : కాకతీయ విశ్వవిద్యాలయ తెలుగు విభా గం నూతన పాఠ్యప్రణాళిక అధ్యక్షుడిగా డాక్టర్ రంగు కిషన్‌ప్రసాద్‌ని నియమిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె. పురుషోత్తం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్ ఏటూరి జ్యోతి నూతన విభాగాధిపతి నియమితులవడంతో ఖాళీ ఏర్పడింది. డాక్టర్ కిషన్‌ప్రసాద్ విశ్వవిద్యాలయంలో 1982 నుంచి విధుల్లో ఉన్నారు. ప్రస్తుతం సహాయ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్నారు. విభాగం డిపార్ట్‌మెంటల్ కమిటీలో, బోర్డు ఆఫ్ స్టడీస్‌లో సభ్యులుగా, విశ్వవిద్యాలయ ఒక అనుబంధ కాలేజీకి గవర్నింగ్ బాడీ సభ్యులుగా ఉన్నారు. వీరి పర్యవేక్షణలో ఏడుగురు పీహెచ్‌డీ చేస్తున్నారు. 60కిపైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పత్రాలు సమర్పించారు.

30 పత్రాలు ప్రచురణ చేశారు. ఒక పుస్తకం రాశారు. కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ యూజీ, పీజీ కోర్సుల్లో పలు పాఠ్యాంశాలు రాశారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles