నేడు చంద్రయాన్-2 వీక్షణ

Sat,September 7, 2019 02:37 AM

-వరంగల్ అర్బన్ జిల్లా విద్యార్థికి ఇస్రో ఆహ్వానం
-ప్రధాని మోడీతో కలిసి వీక్షించే అవకాశం
-తల్లిదండ్రులతో కలిసి బెంగళూరుకు వెళ్లిన పార్థివ్

వరంగల్ క్రైం, సెప్టెంబర్06: దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు ఎదురుచూస్తున్న చంద్రయాన్-2 ల్యాండింగ్ నేడే జరగనుంది. భువి నుంచి దివికి జరిగే అద్భుతమైన చంద్రయాన్-2 ప్రయాణం ఎలా జరిగిందో చూడాలనే ఆసక్తి అందరిలో కలుగుతోంది. కానీ దేశంలోని కోట్ల మందిలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఇద్దరు విద్యార్థులకు అవకాశం వరించగా అందులో హన్మకొండ విద్యార్థి ఉండటం విశేషం. హన్మకొండలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పార్థివ్ భారత అంతరిక్ష విభాగం జాతీయస్ధాయిలో నిర్వహించిన ఆన్‌లైన్ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి చంద్రయాన్-2 వీక్షణకు ఎంపికయ్యాడు. దీంతో బెంగూళూర్ ఇస్రో ట్రాకింగ్ సెంటర్ నుంచి చంద్రయాన్-2 ల్యాండింగ్‌ను ఈ నెల 7న ప్రధాని మోదీతో కలిసి వీక్షించే అవకాశం కొట్టేశాడు.

ఇస్రొ నుంచి గత నెల 30న అధికారికంగా ఆహ్వానం అందుకున్నాడు. సెప్టెంబర్ 6 సాయంత్రమే ఇస్రోకు చేరుకోవాలని విద్యార్థి పార్ధివ్‌తో పాటు గార్డియన్స్‌కు ఇస్రో ట్రైయిన్ టికెట్స్ రిజర్వేషన్ చేయించింది. ఈ క్రమంలోనే పార్థివ్ అతడి తల్లితండ్రులు బెంగుళూర్‌కు తరలివెళ్లారు. 48 రోజుల తర్వాత శనివారం తెల్లవారుజామున చంద్రయాన్-2 ల్యాండింగ్ అవుతుండటంతో నేడు ఉదయం 9 తర్వాత ప్రధాని మోదీ టీం వీక్షించే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లను ఇస్రో చేసినట్లు సమాచారం.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles