విద్యార్థి దశ నుంచే అవగాహన పెంచుకోవాలి

Sat,September 7, 2019 02:33 AM

కేసముద్రం రూరల్, సెప్టెంబర్06 : ప్రజాస్వామ్య స్ఫూర్తితో విద్యార్థులు రేపటి భావి భారతదేశంలో ఉత్తమ రాజకీయనాయకులుగా ఎదగాలని, విద్యార్థి దశనుంచే రాజయకీయాలపై అవగాహన పెంచుకోవాలని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మండలంలోని ఇనుగుర్తి సోషల్‌వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలలో టీఎస్‌డబ్ల్యూర్‌ఎస్ మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, నర్సింహులపేటకు చెందిన విద్యార్థులకు జిల్లా స్థాయి యూత్ పార్లమెంట్ పోటీలు శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరు కాగా జిల్లా కో ఆర్డినేటర్, ప్రిన్సిపాల్ విజయలలిత ఆహ్వానించి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం యూత్ పార్లమెంట్ పోటీల కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీల ద్వారా విద్యార్థులు ప్రజాస్వామ్య విలువలను సమగ్రంగా అర్థం చేసుకుని, యువశక్తిని భారత నిర్మా ణంలో అంతర్లీనం చేసేందుకు దోహద పడుతుందని అన్నారు.

విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరగడంతో పాటుగా విద్యప్రమాణాలు మెరుగుపడుతాయని వివరించారు. అనంతరం హరితహారంలో భాగంగా గురుకుల పాఠశాల ఆవరణలో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వోలం చంద్రమోహన్, జెడ్పీటీసీ రావుల శ్రీనాథ్‌రెడ్డి, సర్పంచ్ దార్ల రాంమ్మూర్తి, తహసీల్దార్ సురేశ్‌కుమార్, ఎంపీడీవో నాగేశ్వర్‌రావు, వీపీబీ ప్రేమరాణి, ఉపసర్పంచ్ గుండ్రపెల్లి దేవేందర్, బొబ్బిలి మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీలు, అధ్యాపక బృంధం తదితరులు పాల్గొన్నారు.

43
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles