ఉపాధ్యాయులకు సన్మానం

Sat,September 7, 2019 02:33 AM

మహబూబాబాద్ రూరల్, సెప్టెంబర్ 06 : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవీ కాన్యకపరమేశ్వరి దేవాలయంలో వాసవీక్లబ్ లక్ష్మీనారాయణ కపుల్స్ ఆధ్వర్యంలో జిల్లాలోని పలువురు ఉపాధ్యాయులను శుక్రవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా క్లబ్ బాధ్యుడు, ఉపాధ్యాయుడు చీదర వీరన్న మాట్లాడుతూ.. వాసవీక్లబ్ కపుల్స్ స్వచ్చంధ సంస్థ నిర్వాహకులు ఉపాధ్యాయులను సన్మానించడం చాలా ఆనందంగా ఉందన్నారు. దీంతో ఉపాధ్యాయులపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వాసవీ క్లబ్ కపుల్స్ బాధ్యుడు పీ పాండురంగయ్య, ఎస్ మురళికృష్ణ, కే శ్రీనివాస్, ఎస్ విజయ్, ఆర్ కృష్ణ, ఎస్ ఉపేందర్, టీ జగదీశ్వర్ పాల్గొన్నారు.

కోటేశ్వరికి దక్కిన అరుదైన గౌరవ సన్మానం
గార్ల : మాట్రిన్ ధరావత్ కోటేశరికి అరుదైన గౌరవం దక్కింది. స్థానిక ఆదివాసి గిరిజన ఆశ్రమ పాఠశాలలో మ్యాట్రీన్‌గా విధులు నిర్వహిస్తున్న కోటేశ్వరిని ఉత్తమ ఉద్యోగిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ నెల గురువారం (5న) భద్రాచంలోని బీఈడీ కళాశాలలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సభలో కోటేశ్వరికి ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్, డీటీడీవో ఎండీ జహీరుధ్ధీన్ మెమోంటోతో పాటు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఉత్తమ సేవకురాలిగా రాష్ట్ర ప్రభుత్వం కోటేశ్వరిని గుర్తించడంతో మండలంలోని ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగులతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles