పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

Sat,September 7, 2019 02:32 AM

గూడూరు : పోషణలోపం లేని తెలంగాణను సాదిధిద్ధామని సీడిపీవో నీలోఫర్‌అజ్మీ అన్నారు. మండల కేంద్రంలో పోషకాహారం మాసోత్సవం సందర్భంగా అంగన్‌వాడీ టీచర్లు శుక్రవారం ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. గర్భిణులు, చిన్నారులు, మహిళలు పోషకాహారంపై దృష్టి సారించాలన్నారు. పోషణమాసం సందర్భంగా అవగాహన కోసం పాఠశాలలు, కళాశాలల్లో వ్యాస రచన పోటీలను నిర్వహించన్నుట్లు సీడీపీవో తెలిపారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్లు లాలస, జ్యోతి, రామలక్ష్మి, అనిత, రాజేశ్వరి, పోషన్ అభియాన్ కోఅర్డినేటర్ చైతన్య, బీపీఏ లక్ష్మీనారాయణ, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.

బయ్యారం : పోషక విలువలతో కుడిన ఆహరం తీసుకోవడం వల్ల గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంటారని సర్పంచ్ మాధవి అన్నారు అల్లిగూడెం సెక్టారు పరిధిలోని నారాయణపురంలో పోషకాహరం వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్‌వైజర్ సుగుణ మాట్లాడుతూ చిరు ధాన్యాలు, ఆకు కూరలు పండ్లు, పప్పు దినుసుల్లో ఎక్కువ రకాల ప్రోటీన్లు ఉంటాయని కావున వాటిని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొమరయ్య, టీచర్ సునీత పాల్గొన్నారు.

గార్ల రూరల్(డోర్నకల్) : అంగన్‌వాడీ కేంద్రాల్లోనే సంపూర్ణ పౌష్టికాహారం లభిస్తుందని బొడ్రాయి తండా సర్పంచ్ గమ్మిరాజు అన్నారు. మండల పరిధిలోని బొడ్రాయి తండా, బదం కోమ్మతండా అంగన్‌వాడీ కేంద్రాల్లో సామూహిక సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలు శిశు అభివృద్ధికి తోడ్పడుతాయన్నారు. ఈ కార్యక్రమాల్లో జోగ్యతండా సర్పంచ్ ఆంగోత్ సరోజ, బొడ్రాయి తండా ఉపసర్పంచ్ భాస్కర్, కార్యదర్శి ప్రవీణ, హెచ్‌ఎం ఇందిరా రాణి, రాజు, వార్డు సభ్యులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles