రుణాల మంజూరులో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలి

Sat,September 7, 2019 02:32 AM

-జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 06 : రుణాల మంజూరులో బ్యాంకులు ఉదారంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య పేర్కొన్నారు. రైతులను రుణాల కోసం తిప్పించుకోవద్దని బ్యాంకర్లకు సూచించారు. కష్టపడి సాగుచేసే ప్రతీ రైతుకు రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రతీ రైతుకు కిసాన్ క్రెడిట్ కార్డు జారీ చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్యం ప్రకారం.. వ్యవసాయ రుణాలను మంజూరు చేయాలని ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి సమీక్ష (డీఎల్‌ఆర్‌సీ)సమావేశం నిర్వహంచారు.

ఈ సమావేశంలో 2019-20 సంవత్సరం జూన్ 30 నాటికి రూ.1,50,940.59 లక్షలు, మొత్తం డిపాజిట్లు రూ.2,11,144.67లక్షల అడ్వాన్స్‌లుగా ప్రయారిటీ సెక్టార్ కింద వ్యవసాయ రంగంలో 21,642 లక్షలకుగాను 1,90,112.58 లక్షల అడ్వాన్స్ మంజూరు అయిందన్నారు. పంట రుణాలకు రూ.1,75,135 లక్షలకు గాను రూ.20,816 వేలు మాత్రమే ఇవ్వడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాన్ ప్రియార్టీ సెక్టార్ కింద 21,132లక్షల రుణాలు మంజూరు చేసి 1,213 లక్ష్యాన్ని సాధించినట్లు చెప్పారు. గ్రామాల అభివృద్ధిలో బ్యాంకులది కీలక పాత్ర ఉంటుందని బ్యాంకర్ల సహకారంతోనే వ్యవసాయం అనుబంధ రంగాల పురోభివృద్ధి సాధ్యమని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యతను ఇస్తుందని అన్నారు. సాగుచేసే రైతులకు పంట రుణాలు విరివిగా మంజూరు చేయాలన్నారు. ప్రతీ బ్యాంకు టార్గెట్ పూర్తి చేయటంతోపాటు అవసరమైన ప్రతీ ఒక్క రైతుకు రుణాలు ఇవ్వాలని అన్నారు. రైతులకు పంట రుణాలు ఇతర రుణాల మంజూరీలో మధ్యవర్తులు లేకుండా చూడాలన్నారు. పంట రుణాల విషయంలో గత ఏడాది లక్ష్యం పూర్తి కాలేదని కలెక్టర్ అన్నారు. 79 శాతమే పూర్తి చేశారని, ఈ ఏడాది లక్ష్యం కంటే ఎక్కువ రుణాలు ఇవ్వాలని ఆదేశించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున ప్రతీ రైతుకు రుణం ఇచ్చేలా బ్యాంకర్లు చొరవ తీసుకోవాలన్నారు. ప్రతీ గ్రామంలో ఒక తేదీని నిర్ణయించి రుణాల ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. మహిళా సంఘాలకు రుణాల మంజూరులో వెనుకబడి ఉన్నారని ఈ సంవత్సరం ఎస్‌హెచ్‌జీలకు రుణాలు మంజూరు చేసి లక్ష్యాలను సాధించాలని, కచ్చితంగా వందశాతం రికవరీ ఉంటుందని వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు.

ఫైలెట్ ప్రాజెక్ట్ కింద జిల్లాలో మహిళా సంఘాలకు వ్యవసాయేతర చిన్న కుటీర పరిశ్రమలైన జూట్ బ్యాగులు, బ్రాస్ ఐటమ్స్ తయారీకి రుణాలు ఇవ్వాలని అన్నారు. జిల్లాలోని 50 శాతం గ్రూపులకు రుణాలు అదాయని, ఈ ఏడాది వంద శాతం సంఘాలకు రుణాలు ఇచ్చేలా చొరవ తీసుకోవాలన్నారు. వ్యక్తిగత ఉపాధి పథకాలు గ్రూపులకు ఇచ్చే రణాల మంజూరులో ఇదే పరిస్థితి ఉందన్నారు. బ్యాకర్లు ప్రభుత్వ అధికారులు సమన్వయంతో పని చేసి సకాలంలో రుణాలను అందించాలన్నారు. కొన్ని ప్రైవేటు బ్యాంకర్లు వ్యాపార దృక్పథంతో పనిచేస్తున్నాయని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని అన్నారు. రైతులకు మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంతోపాటు ప్రభుత్వ పథకాల అమలులో అందరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లాలోని అన్ని బ్యాంకుల పని వేళలు ఉదయం11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించేందుకు ఈ సమావేశంలో తీర్మానించి ఆర్‌బీఐకి ఆమోదం కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. అంతకు ముందు 2019-20 సంవత్సరం మహబూబాబాద్ జిల్లా వార్షిక రుణ ప్రణాళికలను, స్వయం సహాయక సంఘాలు 2019-20 బ్యాంక్ లింకేజీ కార్యాచరణ ప్రణాళికలను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆర్‌బీఐ చీఫ్ మేనేజర్ శంకర్‌రెడ్డి, పలు బ్యాంకుల బ్రాంచి మేనేజర్లు, జెడ్పీ సీఈవో సన్యాసయ్య, సీసీ ఓ కొమురయ్య, డీఆర్డీవో సూర్యనారాయణ, వెల్ఫేర్ ఆఫీర్లు, మెప్మా అధికారులు పాల్గొన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles