రహదారుల వెంట మొక్కలు నాటాలి

Sat,September 7, 2019 02:31 AM

-జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
మహబూబాబాద్ నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 06 : హరితహారంలో భాగంగా ఎవెన్యూ ప్లాంటేషన్ నిమిత్తం రహదారులకు ఇరువైపులా వారం రోజుల్లోగా శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆర్‌అండ్‌బీ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ చాంబర్‌లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, నేషనల్ హైవే, రోడ్ల భవానాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో జిల్లాలోని ప్రధాన రహదారులకు ఇరువైపుల మొక్కలు నాటేందుకు వెంటనే పిచ్చి మొక్కలు తొలగించి భూమిని సమాంతరంగా చేసి మొక్కలు నాటి సిద్ధం చేయాలని అన్నారు. ముఖ్యంగా మహబూబాబాద్ నుంచి తొర్రూర్ ప్రధాన రహదారి, మహబూబాబాద్ నుంచి మరిపెడకు వెళ్లే ప్రధాన రహదారి, తొర్రూర్ నుంచి మరిపెడకు వెళ్లే ప్రధాన రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు శుభ్రం చేయాలన్నారు.

వచ్చే వారంకల్లా పూర్తి చేయాలాన్నారు. ప్రణళిక ప్రకారం ఎవెన్యూ ప్లాంటేషన్‌లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్నారు. అదేవిధంగా వర్షం కారణంగా ప్రధాన రహదారుల్లో గుంతలు ఏర్పడి నీరు నిల్వ ఉండడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.

ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ గుంతలను పూడ్చాలన్నారు. నేషనల్ హైవేపై ఎన్‌హెచ్‌ఏఐ ద్వారా నీరంతర పెట్రోలింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఎన్‌హెచ్‌టీఐ ఖమ్మం ప్రాజెక్ట్ అధికారి ప్రసాద్, నేషనల్ హైవే వరంగల్ ఇంజనీర్ వెంకటరమణ, ఖమ్మం డీఈ తానేశ్వర్, జిల్లా రహదారులు భవనాల అధికారి శంకరయ్య, జిల్లా పరిషత్ సీఈవో సన్యాసయ్య, డీఆర్‌డీవో సూర్యనారాయణ, జిల్లా పంచాయతీఅధికారి రంగాచారి తదితరులు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles