దారి దోపిడీ ముఠా ఆటకట్టు

Fri,September 6, 2019 02:57 AM

-వరంగల్ అర్బన్ జిల్లాలో ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
-రూ. 41,200 నగదు 3 సెల్‌ఫోన్లు, రెండు బైకులు, కత్తి స్వాధీనం
-నిందితులంతా 25 ఏళ్లలోపు యువకులే

వరంగల్ క్రైం, సెప్టెంబర్ 05 : నగర శివార్లలో కాపుకాస్తూ దారిదోపిడికి పాల్పడే ముఠా సభ్యులను కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి రూ 41,200 నగదు, 2 ద్విచక్రవాహనాలు, 3 సెల్‌ఫోన్‌లు, కత్తి స్వాధీనం చేసుకున్నుట్లు ఈస్ట్ జోన్ డీసీపీ కె. ఆర్ నాగరాజు పేర్కొన్నారు. డీసీపీ కథనం ప్రకారం... నగరశివార్లలో వరుస దారి దోపిడీ దృష్టా సీపీ రవీందర్ ఆదేశాల మేరకు మామునూర్ ఏసీపీ శ్యాంసుందర్ ఆధ్వర్యంలో నిందితులపై నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఏసీపీ పర్యవేక్షణలో గీసుకొండ సీఐ శివరామయ్య వరంగల్ కీర్తినగర్‌లో వాహనాలు తనిఖీ చేస్తుండగా పాపయ్యపేటకు చెందిన కారు మెకానిక్ సయ్యద్ ఖాజాపాషా, చింతల్‌కు చెందిన కారు డ్రైవర్ ఎండి. తౌఫిక్, ఎల్‌బీనగర్‌కు చెందిన మార్బుల్ వర్కర్ తన్వీర్, జాన్‌పాక ఆదర్శనగర్‌కు చెందిన సిమెంట్ ఇటుకల వర్కర్ ఎండి ఇమ్రాన్, హమాలీ ఎండి యాకుబ్‌పాషా, చింతల్‌కు చెందిన మైనరుతో కలిపి ఆరుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా పట్టుబడటం జరిగిందన్నారు.

ఆదుపులోకి తీసుకొని విచారించగా నేరాలను ఒప్పుకున్నారన్నారు. నగర శివార్లలో ద్విచక్రవాహనదారుల కోసం కాపు కాసి గాయపరిచి వారి దగ్గరి లభించిన వస్తువులను దోచుకొని అక్కడి నుంచి పరారయ్యేదని వారు గత నెల 23 న వరంగల్ ఎస్‌ఎన్‌ఎం క్లబ్ వద్ద ఓ వ్యక్తిని కొట్టి సెల్‌ఫోన్ దొంగిలించారు. 27న గీసుకొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని స్తంభంపెల్లి వద్ద వ్యక్తిని తీవ్రంగా గాయపర్చి రూ.10 వేల విలువ చేసే సెల్‌ఫోన్‌తో పాటు రూ. 2 వేల నగదు అపహరించారు. 30న ధర్మారం గ్రామశివారు వద్ద వ్యక్తిని గాయపరిచి సిమెంట్ ఇటుకలు తయారు సాంచాను దొంగిలించారు. ఈ నెల 2న సంగెం పోలీస్‌స్టేషన్ పరిధిలో కోట వెంకటాపురం వద్ద వ్యక్తిని కొట్టి ఒక ఫోన్, రూ. 500 దొంగిలించినట్లు విచారణలో తేలిందన్నారు. కాగా దోపిడీలో పాల్గొన్న నిందితుల్లో మైనర్ పరారీలో ఉన్నట్లు చెప్పారు. నిందితులను పట్టుకొని చోరీ సొమ్మును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీఐ అబ్ధుల్ రహీం, హెడ్‌కానిరిస్టేబుల్స్ రాజయ్య, పాపయ్య, అశోక్, కానిస్టేబుల్స్ రవీందర్, చంద్రయ్య, ప్రసాద్, దామోదర్‌లను డీసీపీ అభినందించారు.

44
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles