పురుగుల మందు తాగి వ్యక్తి మృతి

Fri,September 6, 2019 02:54 AM

గార్ల రూరల్/గార్ల,సెప్టెంబర్05: పురుగుల మందుతాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని సీతంపేట గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పాత పోచారం గ్రామానికి చెందిన అల్లం ఉమేశ్ (33) అనే వ్యక్తికి తొమ్మిది సంవత్సరాల కింద సీతంపేట గ్రామానికి చెందిన ఉమాతో వివాహం జరిగింది. పెళ్లి అయిన నాలుగు సంవత్సరాల తర్వాత నుంచి వారి మధ్యతరుచూ గొడవలు జరుగుతుండేవి. రెండు సంవత్సరాలు కిందట ఉమేశ్ సీతంపేట వచ్చి అక్కడే వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అయినప్పుడికి భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఉమేశ్ మనస్తాపంతో గురువారం ఉదయం 10.30 నిమిషాలకు చేను వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి వెళ్లి, అత్తగారి ఇంటి ఎదుట పడిపోయాడు. చుట్టుపక్కల వారు చూసి చికిత్స నిమిత్తం గార్ల ప్రభుత్వ దవాఖానకు, అక్కడి నుంచి మహబూబాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లగా చికి త్స పొందుతూ మృతిచెందాడు. తండ్రి అల్లం సుధాకర్ ఫిర్యాదు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles