30 రోజుల కార్యాచరణ ప్రణాళికపై సదస్సులు

Fri,September 6, 2019 02:53 AM

తొర్రూరు రూరల్, సెప్టెంబర్ 05: ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీడీవో గుండె బాబు అన్నారు. గురువారం డివిజన్ కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన 30 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో అయన మాట్లాడారు. సమావేశంలో ఎంపీపీ తూర్పాటి చిన్న అంజయ్య, మండల ప్రత్యేకాధికారి ఆంజనేయస్వామి, తహసీల్దార్ రమేశ్‌బాబు, వైస్ ఎంపీపీ శ్యాంసుందర్‌రెడ్డి, ఏవో కుమార్‌యాదవ్, ఎంఈవో బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రంలో..

కేసముద్రం రూరల్: గ్రామ పంచాయతీలలో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు జరిపేందుకు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వోలం చంద్రమోహన్ అధ్యక్షతన అవగాహన సదస్సు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ సురేశ్‌కుమార్ మాట్లాడుతూ ఆయా గ్రామాలలోని సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను అభివృద్ధి పరుచుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనాథ్‌రెడ్డి, మండల ప్రత్యేక అధికారి ఛత్రూనాయక్, ఎంపీడీవో నాగేశ్వర్‌రావు, వైస్‌ఎంపీపీ రావుల నవీన్‌రెడ్డి, ఆయా గ్రామల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles