చెక్కు బౌన్స్‌పై రైతు ఆందోళన

Fri,September 6, 2019 02:52 AM

కేసముద్రంటౌన్,సెప్టెంబర్05: పంటను కొనుగోలు చేసిన వ్యాపారి ఇచ్చిన చెక్కు బౌన్స్ అవ్వడంతో రైతు ఆందోళన చెందిన సంఘటన గురువారం కేసముద్రం మార్కెట్‌లో చోటు చేసుకుంది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బేరువాడ గ్రామానికి చెందిన బేరబొయిన వెంకన్న కొన్నిరోజుల కింద మార్కెట్‌లో పసుపును విక్రయించాడు. ఈ నామ్ పద్ధతిలో పంట ఉత్పత్తులను కొనుగోలు చేసిన రోజే వ్యాపారులు డబ్బులను రైతు బ్యాంక్ ఖాతాలోకి నగదు బదిలీ చేయాల్సి ఉంది. అయితే కొంత మంది వ్యాపారులు నగదు బదిలీ చేయకుండా రైతులకు వాయిదా పద్దతిలో చెక్కులు అందిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యాపారి ఇచ్చిన చెక్కు తీసుకున్న రైతు వెంకన్న గురువారం బ్యాంక్‌కు వెళ్లి తన ఖాతాలో వేసుకున్నాడు.

సదరు వ్యాపారికి చెందిన కంపెనీ ఖాతాలో డబ్బులు లేకపోవడంతో చెక్కు బౌన్స్ అయ్యి రైతుకు రూ.2 వందల జరిమాన పడింది. బ్యాంక్‌లో డబ్బులు లేవనే విషయాన్ని రైతు వెంకన్న సదరు వ్యాపారి దృష్టికి తీసుకవెళ్లగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆందోళన చెందిన వెంకన్న మార్కెట్ అధికారులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లగా కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో వెనుదిరుగాల్సి వచ్చింది. ఈ విషయంపై కార్యదర్శి మల్లేశంను వివరణ కోరగా హరిత హారంపై కలెక్టర్‌తో సమావేశం ఉన్నందున అధికారులందరు మహబూబాబాద్‌కి వెళ్లమని, నేడు రైతుకు వ్యాపారి నుంచి డబ్బులు ఇప్పిస్తామని తెలిపారు.

57
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles