రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కాలి

Fri,September 6, 2019 02:52 AM

వెంకటాపూర్, సెప్టెంబర్ 5: రామప్పకు (ఐక్య రాజ్య సమితి విద్యా, విజ్ఞాన (శాస్త్రీయ) మరియు సాంస్కృతిక సంస్థ) యునెస్కో గుర్తింపు దక్కేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేయాలని పురావస్థుశాఖ డైరెక్టర్ దివాకర్ బాబు కోరారు. ప్రపంచ పర్యాటక పటంలో రామప్పను చూడాలన్నది అందరి ఆశయమని, దీనికి అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ చింతకుంట నారాయణరెడ్డి, ఇంటాక్ కన్వీనర్ పాండురంగారావు, ఆర్కియాలజీ వరంగల్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు, డీడీ నారాయణ, ములుగు జిల్లా ఏఎస్పీ సంగ్రాం సింగ్ పాటిల్‌తో కలిసి వారు గురువారం పరిశీలించారు.

ఈ సందర్భంగా రామప్పలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అంతర్జాతీయ పర్యాటక ముఖచిత్రంలో రామప్పను ఉంచాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. దీనికి అన్ని శాఖల అధికారులు పని చేయాలని కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటుగా రామప్పను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా నిధుల కొరత లేదని వెల్లడించారు. రామప్పకు అంతర్జాతీయ గుర్తింపు దక్కితే ములుగు జిల్లా పేరు విశ్వవ్యాప్తం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో టూరిజం జిల్లా అధికారి శివాజీ, పురావస్థుశాఖ జిల్లా అధికారి మల్లేశ్, స్థానిక సర్పంచ్ డోలి రజిత-శ్రీనివాస్, తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ తదితరులు పాల్గొన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles