పల్లె ప్రగతికి పాటుపడాలి

Thu,September 5, 2019 03:24 AM

-30 రోజుల కార్యాచరణ అమలు చేయాలి
-ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
-రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి
-కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
-జిల్లా, మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష
-హాజరైన ఎమ్మెల్యే శంకర్‌నాయక్


మహబూబాబాద్ నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 04 : పల్లె ప్రగతికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట్టాత్మకంగా చేపట్టిన30రోజుల ప్రత్యేక కార్యచరణ పకడ్బందిగా అమలు జరిగేలా ప్రణాళికలు రూపొందించాలని కలెక్టర్ సీహెచ్. శివలింగయ్య అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 30 రోజుల గ్రామ పంచాయతీల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై పలు శాఖల జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ అధికారులతో జరిగిన అవగహన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్ధేశం చేశారు. గ్రామాల్లో గుణాత్మకమైన మార్పు తీసుకురావడంతో పాటు పరిశుభ్రత వెల్లివిరియాలనే ఉద్దేశంతో 30 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిపారు. అందుకనుగుణంగా ప్రతీ ఒక్కరు భాగస్వాముల య్యేలా చైతన్యవంతుల్ని చేసే బాధ్యత మండల పంచాయతీ అధికారులపై ఉందన్నారు. అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను అభివృద్ధి పరుచుకోవాలన్నారు. పంచా యతీరాజ్ చట్టంపై అవగహప పెంపొందించి గ్రామాలను అభివృద్ధి చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు ప్రణాళిక బద్దంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జిల్లా స్థాయిలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, డీఆర్‌డీవో ముఖ్య ప్రణాళిక అధికారి, ఆర్‌డీవో పర్యవేక్షణలో, మండల స్థాయిలో మండల ప్రత్యే క అధికారుల పర్యవేక్షణలో చేపట్టాలన్నారు. ప్ర తీ గ్రామ పంచాయతీలో నాలుగు రకాల స్థాయి సంఘాలను, కోఆప్షన్ సభ్యులను నియమించి అందరి సహకారంతో గ్రామంలో ఉన్న సమస్యలను పరిశీలించి గ్రామా న్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నారు. 30 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామ పంచాయతీలో క్రిమిటోరియా, నర్సరీలు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామంలో పచ్చదనం పరిశుభ్రత పాటించాలన్నారు.

పాడుబడిన బావులను, బోర్లను, లోతట్టు ప్రాతంల్లో నీటి గుంతలు పూడ్చి ప్రతీ ఇంట్లో మరుగుడొడ్డి నిర్మించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎవరైనా రోడ్లపై చెత్త వేస్తే రూ. 500 జరిమాన విధించాలన్నారు. ప్రతీ గ్రామంలో కిలో మీటరు మేర రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటాలని తెలిపారు. గ్రామాల్లో విద్యుత్ సమస్యలను గుర్తించి వనరుల ఆధారంగా పంచవర్ష ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. గ్రామ సభలలో ఆమోదం తీసుకుని ఇంటి పన్ను, ఆస్తి పన్ను తప్పకుండా వసూలు చేయాలన్నారు. 30 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా సీనియర్ టీఎస్ అధికారుల నేతృత్వంలో 100మంది ైప్లెయింగ్ స్కాడ్‌లు ఆకస్మికంగా తనిఖీ చేసి లక్ష్యాలు సాధించిన గ్రామాలకు ప్రోత్సాహకాలు అందిస్తారని తెలిపారు. నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

39
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles