మహమూద్‌పట్నంలో వైద్య శిబిరం

Thu,September 5, 2019 03:22 AM

కేసముద్రం రూరల్, సెప్టెంబర్04: అంతుచిక్కని వ్యాధితో మండలంలోని మహమూద్‌పట్నంలో పలువురు రోగు లు ఇబ్బందులు పడుతున్నారని పత్రిక ల్లో వచ్చిన కథనాలకు స్పందించిన వైద్యసిబ్బంది బుధవారం ఇనుగుర్తి పీహెచ్‌సీ సిబ్బందితో కలిసి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి శ్రీరాం గ్రామంలో పర్యటించారు. వ్యాధితో బాధపడుతున్న లింగయ్యను పరీక్షించారు. గ్రామంలోని మురికి కాల్వల్లో బ్లీచింగ్‌తో పాటుగా వాటర్ ట్యాంకులను పరిశీలించి క్లోరినేషన్ చేయించారు. తాగునీటి విషయంలో, దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

గ్రామంలో మెడికల్ క్యాంపు నిర్వహించి 70 మంది రోగులను పరిక్షించి మందులను పంపిణీ చేశారు. ఇందులో 8 మంది జ్వరంతో బాధ పడుతుండగా వారి నుంచి రక్త నమూనాలను సేకరించారు. ఈ సందర్భంగా శ్రీరాం మాట్లాడుతూ ప్రజలు భయాందోళన చెందవద్దని గ్రామంలో సోకిన వ్యాధి అంటువ్యాధి కాదన్నారు. వ్యాధి సోకినవ్యక్తి వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ వైద్యాధికారి అంబరీష్, ర్యాపిడ్ సర్వేఫీవర్ టీం, ఎపిడమిక్ టీం, వైద్యాధికారి అనీల్‌కుమార్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

38
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles