రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

Thu,September 5, 2019 03:22 AM

గార్ల రూరల్(డోర్నకల్)/మహబూబాబాద్ రూరల్,సెప్టెంబర్04: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ - గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్ మధ్యలో చోటుచేసుకుంది. జీఆర్‌పీ పోలీసు వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం... మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన శ్యామ్‌సుందర్ శర్మ(29) ఐదుగురు సభ్యుల బృందంతో భోపాల్ నుంచి మిలినియమ్ ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతి వెళ్తుండగా రైలు నుంచి జారిపడి అక్కడిక్కడే మృతి చెందాడు.మృతుదేహన్ని డోర్నకల్ జీఆర్‌పీ పోలీసులు స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరి యా దవాఖానకు తరలించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి వెంట బాబాయి, ముగ్గురు వర్కర్లు ఉన్నారు.

45
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles