మళ్లీ మత్తడి పోస్తున్న పెద్దచెరువు

Thu,September 5, 2019 03:22 AM

బయ్యారం, సెప్టెంబర్ 04 : మండలంలోని పర్యటక ప్రాంతాలైన బయ్యారం పెద్దచెరువు, ఏడు బావుల జలపాతాలు అందాలతో కనువిందు చేస్తున్నాయి. చుట్టూ పచ్చని చెట్లు. గళ గళ నీటి సవ్వడులతో ఆహ్లాదకర వాతవరణంతో చూపరుల మనస్సును దోచుకుంటున్నాయి. మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పెద్దచెరువు మరోసారి అలుగు పడి 3 ఫీట్ల ఎత్తులో మత్తడి పోస్తుండగా, గంగారం, బయ్యారం సరిహద్దులో ఉన్న పాండవుల గుట్టల్లో ఉన్న ఏడు బావుల జలపాతంలో నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఈ ప్రాంతాలు ప్రకృతి రమణీయతతో సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజులగా సందర్శకుల తాకిడి రోజు రోజుకూ పెరుగుతోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో వస్తుండడంతో ఈ ప్రాంతాల్లో సందడి నెలకొంది.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles