6 నుంచి పెన్షన్, సీపీఎస్‌పై అవగాహన కార్యక్రమం

Thu,September 5, 2019 03:21 AM

మహబుబాబాద్,నమస్తే తెలంగాణ, సెప్టెంబర్ 04 : రాష్ట్ర ఖజానా శాఖ డైరెక్టర్, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, డెవలప్‌మెంట్ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ఆదేశాల మేరకు ఈనెల 6,7 తేదీల్లో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖల డ్రాయింగ్, డిస్బర్సింగ్ (డీడీవో)అధికారులకు నూతన పెన్షన్, సీపీఎస్‌పై స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కల్పిస్తున్నట్లు జిల్లా ఖజానా అధికారి ఎం విప్లవకుమార్ బుధవారం ఒక ప్రకటలో తెలిపారు. 6వ తేదీన ఉదయం 10.30 గంటలకు జిల్లా ఖజానా కార్యాలయం పరిధిలోని విద్యా సంస్థలు, స్కూల్స్, కాలేజీలు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్‌కు చెందిన డీడీవోలకు మధ్యాహ్నం 2.30 గంటలకు డీటీవో పరిధిలోని అవగాహనా కార్యక్రమం ఉటుందన్నారు. 7వ తేదీన ఉదయం 10.30 గంటలకు మరిపెడ డివిజన్ సబ్‌ట్రెజరీ కార్యాలయం పరిధిలోని డీడీవోలు మధ్యాహ్నం 2.30 గంటలకు గూడూరు సబ్‌ట్రెజరీ కార్యాలయం పరిధిలోని డీడీవోలకు అవగాహన కల్పించనున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమాన్ని సద్విని యోగం చేసుకోవాలన్నారు.

30
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles