పోస్ట్ పేమెంట్ సేవలను వినియోగించు కోవాలి

Thu,September 5, 2019 03:21 AM

మహబూబాబాద్ రూరల్ సెప్టెంబర్ 04: మహబూబాబాద్ హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో కల్పిస్తున్న పోస్ట్ పేమెంట్ సేవలను వినియోగించుకోవాలని పోస్ట్ మాస్టర్ సుధాకర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహబూబాబాద్ బ్రాంచ్ పరిధిలో195 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల ద్వారా సేవలు అందుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సేవింగ్స్, కరెంట్ ఖాతాలు తీసుకోవచ్చని, సేవింగ్ ఖాతాలో ఎటువంటి కనీస నగదు లేకపోయినా ఫైన్ విధింబడదని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి ఆధార్‌ద్వారా బదిలీ అయ్యే అన్ని సంక్షేమ పథకాలకూ ఈ ఖాతాలు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. బ్యాంకు సేవలు ప్రారంభించిన ఐదు నెలల కాలంలో 60 వేల ఖాతాలు తెరిచినట్లు ఆయన వివరించారు. ఈ పోస్టాఫీస్ బ్యాంకు సేవలు ప్రతీ ఒక్కరు ఉపయోగించుకోవాలన్నారు.

33
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles