పాఠశాలలను తనిఖీ చేసిన డీఈవో

Sun,August 18, 2019 03:32 AM

కొత్తగూడ, ఆగస్టు 17: కొత్తగూడ ఏజెన్సీలోని పొగళ్లపల్లి జిల్లా పరిషత్ పాఠశాలను జిల్లా విద్యాధికారి సోమ శేఖర్‌శర్మ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు బోధన చేస్తున్న తీరును పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకునేందుకు ప్రశ్నలు వేయడం, బ్లాక్ బోర్డ్‌పై రాయించడం చేశారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించడమేకాకుండా ఉత్తీర్ణత శాతాన్ని పెంచే విధంగా కృషి చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. వెనకబడి విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శిక్షణతో విద్యాబోధన అందించాలన్నారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఆయన వెంట ఏఎంవో శ్రీరాములు, ఎంఈవో శ్రీదేవి, సీఆర్పీలు ఉన్నారు.

గంగారం మండలంలో..
గంగారం : గంగారం గిరిజన అశ్రమ బాలికల పాఠశాల, కాస్తూర్బా పాఠశాలలను శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించారు. అనంతరం తరగతి గదులను కలియ తిరుగుతూ విద్యార్థుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ఏర్పాటు చేసి విద్యార్థుల భవిషత్‌కు బంగారు బాటలు వేస్తున్నదన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు, పౌష్టికాహారం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. పాఠశాల ఆవరణలో పరిశుభ్రత ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. డీఈవో వెంట ఏఎంవో శ్రీరాములు, ఎంఈవో శ్రీదేవి, హెచ్‌ఎం తోలెం సరస్వతి, వంక సూజత, ఉపాధ్యాయులు ఉన్నారు.

29
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles